అయ్యప్ప భక్తులకే కోపం తెప్పించారు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఏంటీ పరిస్థితి..?

అయ్యప్ప భక్తులకే కోపం తెప్పించారు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఏంటీ పరిస్థితి..?

హైదరాబాద్‌: ఎయిర్‌లైన్స్‌ ఆపరేషనల్‌ ఇష్యూస్‌ కారణంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన 11 విమానాలు రద్దయ్యాయి. కొన్ని విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో.. బుధవారం ఉదయం నుంచి ప్రయాణికులు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా.. శబరిమల వెళ్లాల్సిన అయ్యప్ప భక్తుల తిప్పలు వర్ణనాతీతం. విమానం వస్తుందో.. రాదో తెలియదు. వచ్చినా ఎప్పటికి వస్తుందో తెలియదు. ఎంక్వైరీలో సరైన స్పందన లేకపోవడంతో అయ్యప్ప భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

విమానాశ్రయంలో నిరసనకు దిగారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు, ఢిల్లీ, మదురై, కోల్‌కతా, భువనేశ్వర్‌, గోవా వెళ్లాల్సిన కొన్ని విమానాలు రద్దయినట్లు అధికారులు ప్రకటించారు. అహ్మదాబాద్‌, గోవా, ఢిల్లీ, భువనేశ్వర్‌, చెన్నై, మదురై, బెంగళూరు నుంచి శంషాబాద్‌కు రావాల్సిన విమానాలు కూడా రద్దు కావడంతో ప్రయాణికులు నిరాశతో ఎదురుచూస్తూ విమానాశ్రయంలోనే పడిగాపులు కాశారు.

శంషాబాద్ విమానాశ్రయానికి రావలసిన విమానాలు:
* గోవా, అహ్మదాబాద్, చెన్నై ,మధురై, భువనేశ్వర్, బెంగళూరు, ఢిల్లీ

శంషాబాద్ విమానాశ్రయం నుండి వెళ్లాల్సిన.. రద్దయిన విమానాలు:
* ఢిల్లీ, మధురై, భువనేశ్వర్, బెంగళూరు, గోవా ,కోల్ కత్తా