ఎల్లారెడ్డి లో ఘనంగా తీజ్..పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి లో ఘనంగా తీజ్..పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి, వెలుగు : తీజ్ ఉత్సవాలు గిరిజన సంసృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఆదివారం రాష్ట్ర ఆదివాసీ గిరిజన అధ్యక్షుడు రాములు నాయక్ తో కలిసి ఎమ్మెల్యే ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు.  యువతులు  మొలకెత్తిన గోధుమ నారును బుట్టల్లో పెట్టుకుని ర్యాలీగా వెళ్లి అమ్మవారికి పూజలు చేశారు.   

పెద్దమ్మ మందిరానికి ఎమ్మెల్యే భూమి పూజ

లింగంపేట, వెలుగు :  మండలంలోని సజ్జన్​పల్లి  గ్రామంలో పెద్దమ్మ మందిర నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు  భూమి పూజ చేసి మాట్లాడారు. మందిర నిర్మాణానికి సహకరిస్తానన్నారు. అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే  భోజనం వడ్డించారు.  కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బుర్ర నారాగౌడ్​, నాయకులు వంజరి ఎల్లమయ్య, అట్టెం శ్రీనివాస్, నగేశ్,  అశోక్, బట్టు విఠల్​ పాల్గొన్నారు.