చంచల గూడ జైలు నుంచి తీన్మార్ మల్లన్న విడుదల

చంచల గూడ జైలు నుంచి  తీన్మార్ మల్లన్న విడుదల

చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు తీన్మార్ మల్లన్న .  అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ  ఉదయం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ చిలకలగూడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. తీన్మార్ మల్లన్న పై ఇప్పటివరకు 38 కేసులు నమోదుఅయ్యాయి. దీంతో మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. 6 కేసులను కొట్టివేసిన హైకోర్టు మిగతా 32కేసులో 31 కేసులకు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 74 రోజుల పాటు తీన్మార్ మల్లన్న జైలులో ఉన్నాడు.