బీసీలకు 4 .. కరీంనగర్ పార్లమెంట్ బరిలో తీన్మార్ మల్లన్న?

బీసీలకు 4 .. కరీంనగర్ పార్లమెంట్ బరిలో తీన్మార్ మల్లన్న?

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో పెట్టిన ఎనిమిది సీట్లకు రేపటిలోగా అభ్యర్థులను తేల్చే అవకాశం  ఉంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశంలో అభ్యర్థులను తేల్చనున్నారని సమాచారం. రేపు ఏ క్షణాన్నైనా  ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే 9 మంది మంది అభ్యర్థులను కాంగ్రెస్ అధినాయకత్వం ప్రకటించింది. ఇందులో ఇద్దరు బీసీలకు అవకాశం లభించింది. జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ పేర్లను ప్రకటించింది. 

రేపటి జాబితాలో కరీంనగర్ క్యాండిడేట్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన తీన్మానర్ మల్లన్న పేరు ఉంటుందని తెలుస్తోంది. ఆయనతో పాటు మెదక్ నుంచి ముదిరాజ్ కులానికి చెందిన నీలం మధు పేరును సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ స్థానాన్ని సైతం బీసీకి ఇస్తారన్న టాక్ ఉంది. అదే జరిగితే ఐదు ఎంపీ స్థానాలు బీసీలకు కేటాయించినట్టవుతుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్, బీజేపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ ఆరు స్థానాలను బీసీలకు, బీజేపీ ఐదు చోట్ల బీసీలకు టికెట్లు ఇచ్చాయి.

 కాంగ్రెస్ కూడా తాము తక్కువేం కాదంటోంది. కనీసం నాలుగు సీట్లయినా ఇవ్వాలనే తలంపుతో ఉన్నది. బీసీలకు టికెట్లు కేటాయించే అంశంపై ఇవాళ ఏఐసీసీ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి మాట్లాడుతూ... బీసీలకు నాలుగు సీట్లు పక్కాగా వస్తాయంటూ భరోసా ఇచ్చారు. దీంతో బీసీ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎవరెవరికి టికెట్లు దక్కుతాయనే అంశంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి.  

  • ఆదిలాబాద్        డాక్టర్ సుమలత , ఆత్రం సుగుణమ్మ 
  • నిజామాబాద్       జీవన్ రెడ్డి 
  • కరీంనగర్        తీన్మార్ మల్లన్న 
  • ఖమ్మం        పొంగులేటి ప్రసాద్ రెడ్డి/ మల్లు నందిని 
  • భువనగిరి        చామల కిరణ్ కుమార్ రెడ్డి/ కోమటిరెడ్డి లక్ష్మి 
  • మెదక్        నీలం మధు / రవీంద్రనాధ్ 
  • వరంగల్        దొమ్మాటిసాంబయ్య / పసునూరి దయాకర్ / పరంజ్యోతి 
  • హైదరాబాద్        షానవాజ్ తబాస్సమ్ / బీసీ నేత