Health Tips : లవంగ నూనె, ఉప్పు నీళ్లు, పుదీనా టీ : మీ పంటి నొప్పికి వంటింట్లో పెయిన్ కిల్లర్

 Health Tips : లవంగ నూనె, ఉప్పు నీళ్లు, పుదీనా టీ : మీ పంటి నొప్పికి వంటింట్లో పెయిన్ కిల్లర్

జనాలు చాలామంది.. ఏది తినాలన్నా.. నమలానన్నా.. పంటి నొప్పితో ఇబ్బంది పడుతుంటారు.  రిలీఫ్​ కోసం దగ్గర్లోని మెడికల్​ షాపునకు వెళ్లి... రెండు ట్యాబ్​ లెట్స్​ తెచ్చుకొని వేసుకుంటారు.  అయితే అవి పంటి నొప్పి తగ్గించినా.. సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తాయని చెబుతున్నారు.  కాని అలా కాకుండా ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్స్​ లేకుండా..తేలిగ్గా వంటిట్లో ఉండే కొన్ని పదార్దాలతో తగ్గించుకోవచ్చు.. ఇప్పుడు పంటి నొప్పి నివారణకు కిచెన్​ టిప్స్​ గురించి తెలుసుకుందాం. . . 

పిప్పళ్లు వంటి కారణాలు ఎన్నో ఉంటాయి. తీవ్రమైన పంటి నొప్పి వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్, ఇనెక్షన్స్ జోలికి వెళ్లకుండా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా సమస్య త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది.

లవంగ నూనె: పూర్వకాలం నుంచి లవంగాన్ని పంటి నొప్పికి అద్భుతమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నొప్పి ఉన్న చోట కాకుండా చిగుళ్లు, నాలుక మీద తగిలితే నొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంది. చిన్న దూదిపై రెండు చుక్కల లవంగ నూనె పోసి, నొప్పి కలిగిస్తున్న పంటిపై పూయాలి.
నొప్పి తగ్గే వరకు దాన్ని అక్కడే ఉంచాలి. అంతేకాదు రెండు లవంగాలను పంటి కింద పెట్టుకున్నా సమస్య తగ్గుతుంది.

అల్లం లేదా మిర్చి ఈ రెండు పదార్థాలు: ఘాటుగా ఉంటాయి. అల్లం, ఎండుమిర్చిని సమపాళ్లలో తీసుకుని సరిపడా నీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. ఒక చిన్న దూదిని ఆ పేస్ట్ లో ముంచి నొప్పి ఉన్న చోట కొద్దిసేపు అది మిపెట్టాలి. రెండూ కాకుండా ఒక్కొక్కదాన్ని విడిగా కూడా ట్రై చేయొచ్చు. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే నొప్పి తగ్గుతుంది.

ఉప్పు నీళ్లు: ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో అర టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. దాన్ని నోట్లో పోసుకుంటూ నాలుగైదుసార్లు అరనిమిషం పాటు పుక్కిలించాలి. ఈ పద్ధతి నొప్పి
నివారణకు బాగా పని చేస్తుంది. ఎలాంటి వాపులున్నా తగ్గుతాయి కూడా. ఉప్పు నీళ్లు దంతాల చుట్టూ ఉన్న ప్రాంతాలను శుభ్రపరుస్తాయి. అలాగే మంటను కలిగించే ఆమ్లాలను దూరం చేస్తాయి

పుదీనా టీ: ఈ పుదీనా టీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే, దీనివల్ల ఎన్నోరకాల ఉపయోగాలు ఉన్నాయి. ముందుగా ఎండిన పుదీనా ఆకులను నీళ్లలో వేసి ఇరవై నిమిషాలు మరిగించాలి. తర్వాత ఆకులను తీసేసి, తయారైన పుదీనా టీ తో అరనిమిషం పాటు గార్గిలింగ్ చేయాలి. అలాగే రోజుకు రెండుసార్లు పుదీనా టీ తాగాలి. ఇలా తరచూ చేస్తే నోట్లో ఎలాంటి వాపులు, పంటి నొప్పి ఉన్నా తగ్గుతాయి