సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని సర్వే నంబర్ 1057లో ఉన్న 113 ఎకరాల భూదాన్ భూముల్లో జరుగుతున్న అక్రమ కట్టడాలు, సిమెంట్ పరిశ్రమ విస్తరణ యూనిట్4 నిర్మాణ పనులను అధికారులు నిలిపివేశారు. తహసీల్దార్, గ్రామపంచాయతీ అధికారులు ఈ పనులు జరుగుతున్న ప్రదేశం వద్దకు వెళ్లి నిర్మాణ పనులను అడ్డుకున్నారు. అయితే అవసరమైన అనుమతులు పొందేందుకు మైహోం యాజమాన్యం రెండు రోజులు సమయం కోరింది. వారంలోగా అనుమతులు తీసుకోకపోతే అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని అధికారులు హెచ్చరించారు. ఈవిధంగా ఇక్కడ మైహోమ్ ఇండస్ట్రీస్ పనులను అధికారులు నిలిపివేయడం ఇది రెండోసారి. 15 రోజుల క్రితం మొదటిసారి అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని అధికార యంత్రాంగం ఆదేశించింది.
