వీపనగండ్ల, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 ఏండ్లు సంవత్సరాలు గడుస్తున్నా, వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల, చిన్నంబావి మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాలు ఇప్పటివరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ సమస్యను ఉమ్మడి మండలాల ప్రజాప్రతినిధులు స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారు.
శుక్రవారం వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు ఒక్కో భవన నిర్మాణానికి రూ.2.25 కోట్ల చొప్పున నిధులను విడుదల చేశారు. ఈ నిధులతో త్వరలోనే అత్యాధునిక తహసీల్దార్ భవనాలను నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని వీపనగండ్ల మాజీ సర్పంచ్ గోదెల బీరయ్య యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
