హైటెక్ సిటీలో అర్థరాత్రి పట్టుబడిన డబ్బు : నోట్ల కట్టలకు లెక్కలు లేవంట

హైటెక్ సిటీలో అర్థరాత్రి పట్టుబడిన డబ్బు : నోట్ల కట్టలకు లెక్కలు లేవంట

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల క్రమంలో.. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్న బంగారం, వెండి ఆభరణాలు, నగదు భారీగా పట్టుబడుతుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే పోలీసులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి లెక్కలు లేని డబ్బును.. సరైన పత్రాలు లేని ఆభరణాలను స్వాధీనం చేసుకుంటున్నారు. 

ఈ క్రమంలో హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులు.. భారీ డబ్బు పట్టుబడుతుంది. 2023, అక్టోబర్ 24వ తేదీ అర్థరాత్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైటెక్ సిటీ రహేజా మైండ్ స్పేస్ దగ్గర అర్థరాత్రి ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న 2 లక్షల 75 వేల 500 రూపాయల డబ్బును స్వాధీనం చేస్తున్నారు.

Also Read :- తిరుపతిలో 300 కేజీల బంగారం పట్టివేత

సిటీలోనే మరో ప్రాంతంలోనే డబ్బు పట్టుబడింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారం దగ్గర.. వాహనాలను తనిఖీ చేస్తుండగా.. 28 లక్షల 9 వేల 519 రూపాయలను ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. ఇక, కాచిగూడలో వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. కారులో తరలిస్తున్న 50 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.