తెలంగాణ లో ప్రశాంతంగా తొలిరోజు ఏఈఈ ఎగ్జామ్

తెలంగాణ లో ప్రశాంతంగా తొలిరోజు ఏఈఈ ఎగ్జామ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ- – సివిల్) ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తొలిరోజు శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. 

14 జిల్లాల్లోని 38 కేంద్రాల్లో మొత్తం 14,448 మంది అభ్యర్థులకు గాను ఉదయం జరిగిన పేపర్-1కు 10,280 మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్-2కు 10,253 మంది హాజరైనట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఏఈఈ (సివిల్) రెండో రోజు పరీక్ష శనివారం జరగనుంది. దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి హరిత తెలిపారు.