సికింద్రాబాద్, వెలుగు : యూనివర్సిటీల్లోని సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. శనివారం సీఎంతోపాటు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంలను కలిసి వినతి పత్రాలు అందజేశారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగ పదవి విరమణ వయోపరిమితి వయస్సును 65 సంవత్సరాలకు పెంచాలని కోరారు. యూనివర్సిటీలకు పెండింగ్ బకాయిల చెల్లించాలని, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేపట్టాలని, ఉద్యోగులందరికీ హెల్త్ కార్డు ప్రయోజనాలను అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
అధ్యాపకులకు పదోన్నతులు కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సీఎం సానుకూలంగా స్పందించారని అసోసియేషన్నాయకులు తెలిపారు. కార్యక్రమంలో టౌటా అధ్యక్షులు ప్రొఫెసర్ జి. మల్లేశం, ప్రొఫెసర్ సీహెచ్. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు(వర్కింగ్), ప్రొఫెసర్ సరస్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.