- రిలీజ్చేసిన టీజీ న్యాబ్
హైదరాబాద్: డ్రగ్స్, గంజాయికి బానిసలు కావొద్దని అవగాహన కల్పిస్తూ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ టీజీ న్యాబ్) స్పెషల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది. ‘రామసక్కనీ కొడుకా సుగునాలా ముద్దుబిడ్డా.. డ్రగ్స్ కు నువ్వెట్ల బానిసవైపోతివో.. మన బతుకులను ఎట్ల ఆగం చేసినవో’ అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది. మాదకద్రవ్యాలకు బానిసైన కొడుకును చూసి తల్లి ఆవేదన చెందడాన్ని ఈ సాంగ్ లో చూపించారు. తెలంగాణను డ్రగ్స్ రహితంగా మార్చుదామని అవగాహన కల్పించారు.
