సీపీఏ సదస్సుకు స్పీకర్, మండలి చైర్మన్

 సీపీఏ సదస్సుకు స్పీకర్, మండలి చైర్మన్

హైదరాబాద్ , వెలుగు: కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ)–68వ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు తెలంగాణ అసెంబ్లీ బృందం సోమవారం బయల్దేరి వెళ్లింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దంపతులు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దంపతులు, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు వెళ్లారు.

బార్బడోస్ రాజధాని బ్రిడ్జి టౌన్ లో ఈ నెల 11వరకు కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ సదస్సులో పాల్గొన్న అనంతరం స్టడీ టూర్ లో భాగంగా యునైటెడ్ కింగ్ డమ్, ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో అసెంబ్లీ బృందం పర్యటించనుంది.