వచ్చే నెల రెండో వారంలో అసెంబ్లీ

వచ్చే నెల రెండో వారంలో అసెంబ్లీ
  • వారం రోజులు వానాకాల సమావేశాలు
  • కరోనా వల్ల ఎమ్మెల్యేల సీటింగ్‌లో మార్పులు

హైదరాబాద్, వెలుగు: వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను వచ్చే నెల రెండో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటోంది. వారం రోజుల పాటు నిర్వహించే ఆలోచనలో ఉంది. రాజ్యాంగ నిబంధన ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి అసెంబ్లీని సమావేశపరచాలి. మార్చి 17తో బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. కాబట్టి సెప్టెంబర్‌ 16 లోపు సభ మళ్లీ సమావేశం కావాలి. దీంతో వచ్చే నెల రెండో వారంలో అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలని ఇటీవలి కేబినెట్ మీటింగ్‌ టైమ్‌లో కేసీఆర్ అన్నట్టు తెలిసింది. సెప్టెంబర్‌ 3న హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం పూర్తవుతుంది కాబట్టి ఆ తర్వాత సమావేశాలు నిర్వహిస్తే బందోబస్తుకు ఇబ్బందులుండవని పోలీసు వర్గాలు అంటున్నాయి. సెప్టెంబర్‌ 6 లేదా 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే చాన్స్ ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. కరోనా నేపథ్యంలో అసెంబ్లీలో సీటింగ్‌లో మార్పులు చేసే చాన్స్ ఉంది. సభ్యుల మధ్య దూరం ఉండేలా సీట్లు ఏర్పాటు చేయాలను కుంటున్నారు. కరోనాపై ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలు, ఇరిగేషన్ రీ ఆర్గ నైజన్, నియంత్రిత సాగు, ఫుడ్ ప్రాసెసింగ్,లాజిస్టి క్స్‌, వలస కార్మికుల పాలసీలు, టీఎస్‌ బీపాస్, ఎలక్ట్రిక్  వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజీ, హైదరాబాద్ గ్రిడ్ పాలసీతో పాటు టీచింగ్ డాక్టర్ల వయో పరిమితి బిల్లు, ఎఫ్‌ఆర్‌బీఎం సవరణ బిల్లు అసెంబ్లీ ముందుకు రానున్నాయి.