అసెంబ్లీ,మండలి మూడు రోజులు వాయిదా

అసెంబ్లీ,మండలి మూడు రోజులు వాయిదా

గులాబ్  తుఫాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేశారు. అసెంబ్లీ, మండలి సమావేశాలకు సైతం మూడు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఒకటో తేదీన తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. 

తుఫాన్ ఎఫెక్ట్ తో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇవాళ సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ, పోలీస్ , ఫైర్, మున్సిపల్, పంచాయతీరాజ్ ,  నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖలకు సెలవులు రద్దు చేశారు. సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి పరిస్థితిని మానిటరింగ్ చేయాలని ఆదేశించింది.