Telangana Assembly Results : తెలంగాణ ఫలితాల లైవ్‌ అప్‌డేట్స్‌

Telangana Assembly Results  :  తెలంగాణ ఫలితాల లైవ్‌ అప్‌డేట్స్‌

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 49 కేంద్రాల్లో కౌంటింగ్​ జరుగుతోంది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. గజ్వేల్ లో కేసీఆర్, కొడంగల్, కామారెడ్డిలో రేవంత్, ముందంజలో ఉండగా..హుజురాబాద్ లో ఈటల రాజేందర్ వెనుకంజలో ఉన్నారు. ఖమ్మం,వరంగల్ ,నల్లొండ, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు భారీ ఆధిక్యం కనిపిస్తోంది.  మధ్యాహ్నం ఒంటి గంట కల్లా ఫలితాలపై దాదాపు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తొలుత  భద్రాచలం, అశ్వారావుపేట, చార్మినార్​ నియోజకవర్గాల ఫలితాలు​ వస్తాయని ఎన్నికల అధికారులు చెప్పారు.  తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుండగా,  మ్యాజిక్‌ ఫిగర్‌ దాటడానికి ఏ పార్టీకైనా 60 సీట్లు కావాలి.  

  • డీజీపీ అంజనీకుమార్ పై ఈసీ సస్పెన్షన్ వేటు 
    ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అంజనీకుమార్ను సస్పెండ్ చేసిన ఈసీ

  • కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.

  • గజ్వేల్ లో కేసీఆర్ విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై కేసీఆర్ గెలుపొందారు. అయితే, గతంలో కన్నా కేసీఆర్ మెజార్టీ తగ్గింది.

  • ఈటల రాజేందర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న హామీని తాను నిలబెట్టుకున్నానని  పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో119 నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు  డిసెంబర్ 3వ తేదీ ఆదివారం  విడుదలయ్యాయి. హుజురాబాద్ లో  బీజేపీ అభ్యర్తి ఈటల రాజేందర్ ను బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఓడించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈటలకు రిటర్న్ గిఫ్టు ఇచ్చానని చెప్పారు. తన తండ్రిని జెడ్పీటీసీగా గతంలో ఈటల మోసం చేసాడని ఆరోపంచారు. అందుకే.. ఈటలకు ఇది రిటర్న్ గిఫ్ట్ అని.. తాను పార్టీని వీడని చెప్పారు.

  • 4 వేల 274 ఓట్ల మెజారిటీతో నాంపల్లిలో ఎంఐఎం  విజయం

  • కరీంనగర్లో రీకౌంటింగ్కు బండి సంజయ్ డిమాండ్..326 ఓట్లతో కరీంనగర్లో గంగుల కమలాకర్ గెలుపు..కౌంటింగ్ కేంద్రం వద్ద బండి సంజయ్ ఆందోళన  

  • మలక్ పేట్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి 26వేల 90 ఓట్ల మెజార్టీతో గెలుపు 

  • సొంత వాహనంలో ఫాంహౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్

  • సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా.. రాజీనామా లేఖను OSD ద్వారా పంపిన కేసీఆర్

  • గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 7 వేల 290 మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించారు

  • హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి 17 వేల ఓట్ల ఆధిక్యం..రెండో స్థానంలో బీజేపీ, మూడోస్థానంలో కాంగ్రెస్ పార్టీ.

  • రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ఠాకూర్ 56,352 ఓట్లతో విజయం

  • ఓటమి దిశగా ఎర్రబెల్లి దయాకరరావు. పాలకుర్తి నియోజకవర్గంలో 18వ రౌండ్ పూర్తయ్యేసరికి పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి 35 వేల 544ఓట్ల ఆధిక్యం. 

  • సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి విజయం సాధించారు.

  • కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయారు.. 6 వేల ఓట్ల తేడాతో.. బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి చేతిలో ఓటమి. మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి. కామారెడ్డిలో ఊహించని విధంగా బీజేపీ పార్టీ చేతిలో ఓడిపోయిన కేసీఆర్.

  • కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ 10 వేల 305 ఓట్ల మెజార్టీతో.. కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై గెలుపు

  • గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన ముఖ్యమంత్రి 
    కాసేపట్లో రాజభవన్కు కేసీఆర్ 

  • కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ 10 వేల 305 ఓట్ల మెజార్టీతో.. కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై గెలుపు

  • కామారెడ్డి నియోజకవర్గంలో 17 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి. 4 వేల 025 ఓట్ల ఆధిక్యం బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి, రెండో స్థానంలో కేసీఆర్.. మూడో స్థానంలో రేవంత్ రెడ్డి

  • ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాకేష్ రెడ్డి 29 వేల ఓట్ల మెజార్టీతో విజయం. రెండో స్థానంలో కాంగ్రెస్.. మూడో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి.

  • వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ విజయం. బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావుపై 15వేల మెజారిటీతో గెలుపు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నన్నపనేని మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.

  • ప్రగతి భవన్ పేరును డా. అంబేద్కర్ ప్రజాభవన్ గా మారుస్తామన్న రేవంత్ రెడ్డి 

  • సూర్యాపేట సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్రెడ్డిపై 4238 ఓట్లతో గెలుపొందిన BRS అభ్యర్థి జగదీష్రెడ్డి

  • కామారెడ్డి నియోజకవర్గంలో 16వ రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి. బీజేపీ అభ్యర్థి వెంకట రమణ రెడ్డి 3 వేల ఓట్ల ఆధిక్యం. రెండో స్థానంలో కేసీఆర్

  • గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో..

    ఖైరతాబాద్ - బిఆర్ఎస్ - Leading 
    జూబ్లీహిల్స్ - బిఆర్ఎస్ - Leading 
    సనత్ నగర్ - బిఆర్ఎస్ - విజయం
    సికింద్రాబాద్ - బిఆర్ఎస్ - విజయం
    కంటోన్మెంట్ - బిఆర్ఎస్ - విజయం
    అంబర్ పేట - బిఆర్ఎస్  - విజయం
    గోషామహల్ - BJP - విజయం
    ముషీరాబాద్ - బిఆర్ఎస్ - Leading 
    నాంపల్లి - MIM - Leading
    చార్మినార్ - MIM - విజయం
    బహదూర్ పురా - MIM - విజయం 
    చంద్రయణగుట్ట - MIM - విజయం
    మలక్ పేట్ - MIM - Leading
    కార్వాన్ - MIM - Leading
    యాకత్ పురా - MIM - Leading

  • సూర్యాపేట నియోజకవర్గంలో 15వ రౌండ్ పూర్తయ్యే సమయానికి.. 6 వేల ఓట్ల ఆధిక్యంలో జగదీష్రెడ్డి

  • శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 47 వేల 135 మెజార్టీతో గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ

  • అలంపూర్ నియోజకవర్గంలో 19వ రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు 30 వేల 576 ఓట్ల ఆధిక్యం

  • కొడంగల్ నియోజకవర్గంలో 32 వేల 532 ఓట్ల మెజార్టీతో గెలిచిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మొత్తం లక్షా 7 వేల 429 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి 74 వేల 897 ఓట్లు వచ్చాయి.

  • కరీంనగర్ నియోజకవర్గంలో ఉత్కంఠ.. 19వ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు 2 వేల ఆధిక్యం.. 10 వేలకు తగ్గిన గంగుల కమలాకర్ మెజార్టీ.. మరో ఆరు రౌండ్ల లెక్కింపు మిగిలి ఉంది..

  • హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 19 వేల 355 ఓట్ల మెజార్టీతో గెలుపు.. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సతీష్ కుమార్ ఓటమి

  • గోషామహల్ నియోజకవర్గం నుంచి 21 వేల 457 ఓట్ల ఆధిక్యంతో  గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రాజాసింగ్. గోషామహల్ నుంచి వరసగా మూడు సార్లు గెలిచి..  హ్యాట్రిక్ సాధించిన రాజాసింగ్

  • బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఓటమితో ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ సంబరాలు..కాంగ్రెస్ పార్టీ గెలుపు..నిరుద్యోగుల గెలుపు అంటూ ఓయూలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చిన నిరుద్యోగ విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు.

  • మహేశ్వరం నియోజకవర్గం నుంచి  బీఆర్ఎస్ అభ్యర్థిగా సబితా ఇంద్రారెడ్డి 26 వేల 663 ఓట్లతో గెలుపొందారు

  • కూకట్ పల్లి నియోజకవర్గంలో 16వ రౌండ్ ముగిసే సమయానికి 60 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు

  • వైరాలో కాంగ్రెస్ అభ్యర్థి రాందాస్ నాయక్ 33,069 ఓట్లతో విజయం 

  • పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 56,400 ఓట్ల మెజార్టీతో విజయం 

  • కోరుట్ల నియోజకవర్గంలో 17వ రౌండ్ ముగిసిన తర్వాత 9 వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి.. ఓటమి దిశగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్

  • కామారెడ్డి నియోజకవర్గంలో 14 రౌండ్లు పూర్తయ్యే సరికి 1,790 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి.. మూడో స్థానానికి పడిపోయిన రేవంత్ రెడ్డి.. రెండో స్థానంలో కేసీఆర్

  • తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేలు 50 వేల మెజార్టీతో గెలుపు 

  • నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 54,307 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపు 

  • మునుగోడులో 42 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం 

  • జుక్కల్ లో కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీ కాంతారావు 1,152 మెజార్టీతో గెలుపు 
     

  • కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపు 

  • మలక్పేట నియోజకవర్గంలో 15వ రౌండ్ తర్వాత 1,318 ఓట్ల ఆధిక్యంలో ఎంఐఎం అభ్యర్థి

  • వికారాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ గెలుపు 

  • షాద్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి వీర్ల శంకర్ గెలుపు 

  • నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి విజయం

  • సిద్దిపేటలో బీఆర్ఎస్ అభ్యర్ధి హరీశ్ రావు విజయం

  • చేవెళ్ల నియోజకవర్గంలో 20వ రౌండ్ లో 2 వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ఆధిక్యం
     

  • కామారెడ్డిలో బీజేపీ గెలుపు 

  • ఆంథోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ గెలుపు 

  • హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్ ) గెలుపు 

  • మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు 

  • గోషామహల్ లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ గెలుపు 

  • నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయధీర్ రెడ్డి గెలుపు 

  • జుక్కల్ లో కాంగ్రెస్ గెలుపు 

  • పరిగిలో కాంగ్రెస్ గెలుపు 

  • నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ గెలుపు 

  • వేములవాడలో కాంగ్రెస్ విజయం 

  • ఆలేరులో బీర్ల అయిలయ్య (కాంగ్రెస్ ) గెలుపు 

  • మధిరలో భట్టి విక్రమార్క గెలుపు 

  • కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలుపు 

  • మెదక్ లో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గెలుపు 

  • తాండూర్ లో మనోహర్ రెడ్డి (కాంగ్రెస్ ) గెలుపు 

  • ములుగులో సీతక్క గెలుపు 

  • నకిరేకల్ లో కాంగ్రెస్ విజయం 

  • సిర్పూర్ నియోజకవర్గంలో హోరాహోరీగా పోరు.. 13వ రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత.. కేవలం ఆరు ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప.. రెండో స్థానంలో బీఎస్పీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

    గోషామహల్ లో విజయం దిశగా బీజేపీ అభ్యర్థి రాజాసింగ్. 13 రౌండ్ల తర్వాత 25 వేల ఓట్ల ఆధిక్యం
     

  • సిర్పూర్ నియోజకవర్గంలో హోరాహోరీగా పోరు.. 13వ రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత.. కేవలం ఆరు ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప.. రెండో స్థానంలో బీఎస్పీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

    గోషామహల్ లో విజయం దిశగా బీజేపీ అభ్యర్థి రాజాసింగ్. 13 రౌండ్ల తర్వాత 25 వేల ఓట్ల ఆధిక్యం

  • నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ గెలుపు 
    షాద్ నగర్ లో కాంగ్రెస్ గెలుపు 
    చెన్నూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి గెలుపు 
    మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు 
    హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి  46748 ఓట్ల మెజార్టీ 
     

  • బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి 23 పైచిలుకు ఓట్లతో విజయం

    సత్తుపల్లి నియోజకవర్గంలో 14వ  రౌండ్ పూర్తయ్యే వరకు.. కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి10 వేల 587 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.

    ఆలంపూర్ నియోజకవర్గం 11 రౌండ్లు పూర్తయ్యేసరికి 17,766 బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు లీడ్

    ముషీరాబాద్ 11వ రౌండ్ ముగిసే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ 19వేల ఓట్ల ఆధిక్యం

    ఖైరతాబాద్ నియోజకవర్గంలో  7వ రౌండ్ తర్వాత 5 వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్

    జగిత్యాల నియోజకవర్గం 7వ రౌండ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి 2 వేల ఓట్ల ఆధిక్యం

  • ఆర్మూర్ నియోజకవర్గంలో 11వ రౌండ్ తర్వాత 2 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి.. వెనకంజలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి


  • ములుగు నియోజకవర్గంలో 16 రౌండ్ల తర్వాత 23 వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క


  • సత్తుపల్లి నియోజకవర్గంలో 14వ  రౌండ్ పూర్తయ్యే వరకు.. కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి10 వేల 587 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.

  • బెల్లంపల్లిలో గడ్డం వినోద్, చెన్నూరులో వివేక్ వెంకటస్వామికి భారీ ఆధిక్యం

  • మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి గెలుపు 
    కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ పై గెలుపు 

  • బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి 23 పైచిలుకు ఓట్లతో విజయం

  • పాలకుర్తిలో మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు  ఓటమి 
    కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని విజయం 

  • మెదక్ లో పద్మాదేవందర్ రెడ్డి ఓటమి 
    కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గెలుపు

  • ఆందోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహా గెలుపు

  • అంబర్ పేటలో బీఆర్ఎస్ గెలుపు

  • జుక్కల్ లో కాంగ్రెస్ గెలుపుకొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలుపు 

  • 32 వేల 800  ఓట్ల మెజార్టీతో విజయం

  • బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై గెలుపు

  • హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం

  • వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గెలుపు 

  • నిర్మల్ లో బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు
    ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో  10వ రౌండ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి - మల్ రెడ్డి రంగారెడ్డి- 17 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు

  • నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 16వ రౌండ్ తర్వాత.. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి 1,362 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు

  • దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓటమి..
    ఆయనపై బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.

  • బాల్కొండలో  మంత్రి ప్రశాంత్ రెడ్డి విజయం
    45వేల మెజార్టీతో నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపు 
    14 వేల ఓట్ల వెనుకంజలో మైనంపల్లి హనుమంతురావు 
    వెనుకంజలో మంత్రి నిరంజన్ రెడ్డి  
    సంగారెడ్డిలో జగ్గారెడ్డి అధిక్యం 

  • బాల్కొండలో  మంత్రి ప్రశాంత్ రెడ్డి విజయంఆందోల్ లో దామోదర్ రాజనర్సింహ గెలుపు 

  • గాంధీభవన్ కు శివకుమార్ 
     

  • కామారెడ్డి నియోజకవర్గంలో.. 9వ రౌండ్ తర్వాత కూడా వెనకంజలోనే ఉన్న కేసీఆర్.. 1,768 ఓట్ల ఆధిక్యంలో రేవంత్ రెడ్డి

  • బోణీ కొట్టిన బీఆర్ఎస్ 

  • భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు.
    కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై గెలుపొందారు   

  • నిర్మల్ లో గెలుపు దిశగా బీజేపీ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి 

  • సిరిసిల్ల నియోజక వర్గంలో గెలుపు దిశగా కేటీఆర్.. 11వ రౌండ్ తర్వాత 21 వేల ఓట్ల ఆధిక్యం

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మూడో స్థానానికి పరిమితం కావడంతో కౌంటింగ్ కేంద్రం నుండి వెనుతిరిగి వెళ్లిన కొత్తగూడెం బిఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు.

  • మధిరలో భట్టి క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ సంబరాలు. కాంగ్రెస్ సంబరాల్లో పాల్గొన్న మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కుమారుడు సూర్య విక్రమాదిత్య.. కాంగ్రెస్ కార్యకర్తల అభిమానులు.

    కల్వకుర్తిలో 14th  రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ రెడ్డి 3 వేల 633  ఓట్ల ఆధిక్యంతో ముందంజ

    చెన్నూరు నియోజకవర్గంలో ఓటమిని అంగీకరించి కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్.

  • టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు భద్రత కలిపించే  భద్రతపై చర్చించినట్లు తెలుస్తుంది.  

    గద్వాల జిల్లా.. గద్వాల నియోజకవర్గం 8 రౌండ్లు పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి 8 వేల 122 లీడ్

    ఆలంపూర్ నియోజకవర్గ 8వ రౌండ్ పూర్తయ్యే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు 13 వేల 920 లీడ్. అలంపూర్   కౌంటింగ్ సెంటర్ నుండి బయటకు వెళ్లి పోయిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సంపత్ కుమార్
     

  • చెన్నూర్ నియోజకవర్గం 12వ రౌండ్ ముగిసేసరికి  కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి 26 వేల 855 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

  • ఓటమి దిశగా బాల్క సుమన్.

  • చార్మినార్ లో ఎంఐఎం అభ్యర్థి జుల్ఫీకర్ అలీ గెలుపు

  • కాంగ్రెస్‌ ఖాతాలో మరో  విజయం చేరింది.  రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై విజయం సాధించారు. ఇప్పటికే ఖమ్మంలో కాంగ్రెస్ అశ్వారావుపేట, ఇల్లందు నియోజకవర్గాలలో కాంగ్రెస్ విజయం సాధించింది.  

  • వరంగల్ 12 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 10 స్థానాల్లో కాంగ్రెస్ 02 స్థానాల్లో BRS అభ్యర్థులు ఆధిక్యం

  • వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి (7) 6158 ఓట్ల ఆధిక్యం..

  • వరంగల్ తూర్పులో   6271 ఓట్ల తో కాంగ్రెస్ అభ్యర్థి సురేఖ

  • భూపాలపల్లి లో  ( 5) - 10,932 ఓట్ల ఆధిక్యంల్లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు

  • పాలకుర్తి లో -  5వ రౌండ్ ముగిసే వరకు 5297 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి

  • వర్దన్నపేటలో - 10వ రౌండ్ ముగిసే వరకు 4821 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి KR నాగరాజు

  • ములుగు లో - (10 ) 14,716 ఓట్ల ఆధిక్యంతో సీతక్క..

  • మహబూబాబాద్ (6) 13,728 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి మురళినాయక్ ముందంజ

  • డోర్నకల్ - ( 5) 13,186 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రనాయక్

  • స్టేషన్ ఘనపూర్ -(8)  6977 ఓట్ల ఆధిక్యంలో BRS అభ్యర్థి కడియం శ్రీహరి

  • జనగామ -(6)  8640 ఓట్ల ఆధిక్యంలో BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 

  • పరకాల - ( 4) 1401 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి 

  • నర్సంపేట -(10)  4231 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్  అభ్యర్థి దొంతి మాధవ రెడ్డి

  •  

  • ఇల్లందులో కాంగ్రెస్ విజయం 

  • బీఆర్ఎస్ అభ్యర్థి  హరిప్రియనాయక్ పై  కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య 38 వేల మెజార్టీతో విజయం

  • బెల్లంపల్లి నియోజకవర్గంలో 8వ రౌండ్ లెక్కింపు పూర్తవ్వగా 22 వేల 613 వేల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ ముందంజ. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ కు వచ్చిన ఓట్లు 43 వేల 951 ఓట్లు.. బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య కు 21 వేల 338 ఓట్లు

  • చెన్నూరు నియోజవర్గంలో 8వ రౌండ్ అయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి 17 వేల 849 ఓట్ల ఆధిక్యం. కాంగ్రెస్ పార్టీకి 42 వేల 262 ఓట్ల పోలవ్వగా.. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ 24 వేల 413

  • కామారెడ్డి నియోజకవర్గంలో ఏడో రౌండ్ తర్వాత కూడా వెనకంజలోనే కేసీఆర్.. వెయ్యి 961 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ముందంజ

  • గోషామహల్ 9వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ 12 వేల ఓట్ల ఆధిక్యం


    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం :

  • రౌండ్  : 9
    BRS ఎమ్మెల్యే అభ్యర్థి కెపి వివేకానంద : 76671
    కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోలన్ హనుమంత్ రెడ్డి  :  51680
    బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ : 42538
    BRS Lead  : 24991
     

  • కోరుట్ల నియోజకవర్గంలో 4వ రౌండ్ ముగిసిన తర్వాత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ వెనకంజ. 3 వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్

    కొత్తగూడెం నియోజకవర్గంలో నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి.
    సిపిఐ అభ్యర్థి కూననేని సాంబశివరావు: 22,240.
    ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జలగం వెంకటరావు: 8677.
    బిఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు: 6416
    సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు...13,563 ఓట్లతో ముందంజ.
     

  • మధిరలో 8 రౌండ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్కకు 15  వేల 819 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • తెలంగాణలో కాంగ్రెస్ బోణీ కొట్టింది 
    ఆశ్వారావుపేటలో కాంగ్రెస్ విజయం 
    23,358 ఓట్ల తేడాతో కాంగ్రెస్  అభ్యర్థి ఆదినారాయణ రావు గెలుపు
    బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై గెలుపు 

  • నిజామాబాద్ అర్బన్ 8వ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి 3 వేల 188ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ వెనకంజ

  • సూర్యాపేట నియోజకవర్గంలో ఐదో రౌండ్ ముగిసే సరికి మంత్రి జగదీష్ రెడ్డి ఆధిక్యం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పై  3 వేల 373 ఓట్ల ఆధిక్యంతో జగదీష్ రెడ్డి..

  • తెలంగాణలోని బీజేపీ ముఖ్యనేతలు వెనుకంజలోఉన్నారు.  కరీంనగర్ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ వెనుకంజలో ఉండగా,  హుజురాబాద్ లో,గజ్వేల్ లో ఈటల రాజేందర్ వెనుకబడిపోయారు. రఘునందన్ రావుపై  కొత్త ప్రభాకర్ రెడ్డి మంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్ లోని గోషామహల్ లో రాజాసింగ్ స్వల్ప మెజార్టీతో  కొనసాగుతున్నారు. 

  • స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి. 6 వేల 611 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి

  • గోశామహల్ నియోజకవర్గం
    6వ రౌండ్  

    బీజేపీ రాజాసింగ్ ముందంజ
    రాజాసింగ్ లీడ్ 3401
      అభ్యర్థులు    
    1.నందకిషోర్ వ్యాస్ బిలాల్(బీఆర్ఎస్)*1626  
    2.మోగిలి సునీత(కాంగ్రెస్)*517
    3.రాజాసింగ్ (బిజెపి)*6049

    చెన్నూర్ నియోజకవర్గంలో 6వ రౌండ్ లెక్కింపు పూర్తవ్వగా 13570 వేల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ముందంజ
    కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి వచ్చిన ఓట్లు 30759 
    బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కు వచ్చిన ఓట్లు 17189

    ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లురి లక్ష్మణ్ కుమార్ లీడ్ కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వెనకంజ. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 10 వేల 207 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

    పాలకుర్తిలో నాలుగు రౌండ్లు పూర్తి.. బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకరరావు వెనకంజ.. కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి  5 వేల 416 ఓట్ల  ఆధిక్యం

  • తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా  హైదరాబాద్ లో  బీఆర్ఎస్ అధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.   బీఆర్ఎస్ 6, ఎంఐఎం4, బీజేపీ 3 ,కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.  

  • జూబ్లీహిల్స్ నియోజకవర్గం 4వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్..  710 ఓట్ల ఆధిక్యం.. నాలుగో రౌండ్ లో  బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ వెనుకంజలో ఉన్నారు. నాంపల్లిలో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. 

  • ఖైరతాబాద్, సనత్ నగర్, సికింద్రాబాద్,కంటోన్మెంట్, అంబర్ పేట,ముషీరాబాద్ లో  బీఆర్ఎస్ లీడ్ లో ఉంది. గోషామహల్ ,కార్వాన్, యాకుత్ పురాలో బీజేపీ లీడ్ లో ఉంది.  చార్మినార్, బహదూర్ పురా,చంద్రాయణగుట్ట, మలక్ పేటలో ఎంఐఎం లీడ్ లో ఉంది. 

  • ఓటు అనే బుల్లెట్ ద్వారా ప్రజలు  బీఆర్ఎస్ నాశానం చేశారు  :  పొంగులేటి 
    ఉమ్మడి ఖమ్మం స్థానాల్లో పదికి పది సీట్లు గెలిచాం

  • గజ్వేల్ నియోజకవర్గంలో మూడో రౌండ్ పూర్తయ్యే సరికి కేసీఆర్ తన సమీప ప్రత్యర్థి ఈటల రాజేందర్ పై 3 వేల 020 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.

  • పాలకుర్తిలో నాలుగు రౌండ్లు పూర్తి.. బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకరరావు వెనకంజ.. కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి  5 వేల 416 ఓట్ల  ఆధిక్యం

  • జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మూడో రౌండ్ లెక్కింపు పూర్తి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ వెయ్యి 045 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    పినపాక నియోజక వర్గం 5వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు  10 వేల 142ఓట్ల మెజారిటీతో ముందంజ లో ఉన్నారు

    జూబ్లీహిల్స్ నియోజకవర్గం 4వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్..  710 ఓట్ల ఆధిక్యం.. నాలుగో రౌండ్ లో వెనకబడిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్

 
  • సిరిసిల్ల నియోజక వర్గం 
  • 5వ రౌండ్...
  • కాంగ్రెస్ -2525
  • బీఅర్ఎస్ - 4105
  • బీజేపీ - 1149
  • బిఆర్ఎస్ లీడ్ - 1580
  • 5వ రౌండ్ బిఆర్ఎస్ కెటిఆర్ లీడ్ - 5329
  • కామారెడ్డి నియోజకవర్గంలో నాలుగో రౌండ్ లోనూ కేసీఆర్ వెనకంజ.. రేవంత్ రెడ్డి ఆధిక్యం.. 
  • కాంగ్రెస్...2679, Brs..2476, Bjp...3436
  • మిర్యాలగూడ నియోజకవర్గం 6 th రౌండ్ ముగిసేటప్పటికి కాంగ్రెస్ లీడ్ :- 13 వేల 509 ఓట్లు
  • నల్లగొండ నియోజకవర్గం 09 th రౌండ్ ముగిసేటప్పటికి కాంగ్రెస్ లీడ్ 25 వేల ఓట్లు
  • ఆలేరు నియోజకవర్గం 13 th రౌండ్ ముగిసేటప్పటికి కాంగ్రెస్ లీడ్ 15 వేల ఓట్లు
  • వెనకంజలో గద్దర్ కూతురు 
  • బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత లీడ్ లో ఉన్నారు 
  • 7221 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్
  • కోరుట్ల నియోజకవర్గంలో రెండో రౌండ్ పూర్తయ్యే సమయానికి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ వెనకంజ.
    కాంగ్రెస్. : 3890, బీజేపీ  : 6168, బీఆర్ఎస్ : 7374 -... BRS:  1206 ఆధిక్యం

  • మధిరలో 12500 ఓట్ల మెజార్టీ 
    కొల్లాపూర్ లో కాంగ్రెస్ 1200 ఓట్లతో మెజార్టీ 
    షాద్ నగర్ లో కాంగ్రెస్ ఆధిక్యం 
    బోధన్ లో కాంగ్రెస్ ఆధిక్యం 

  • వెనుకంజలో జగ్గారెడ్డి, మైనంపల్లి

    జగిత్యాల జిల్లా 

    ధర్మ పురి: 2రౌండ్
    కాంగ్రెస్.      : 8604
    బీజెపి          : 784
    బీఆర్ ఎస్  : 6738
    లీడ్...  కాంగ్రెస్:   1866

    కోరుట్ల :  2రౌండ్

    కాంగ్రెస్.      : 3890
    బీజెపి          : 6168
    బిఆర్ఎస్  : 7374
    లీడ్. బిఆర్ఎస్  :   1206

    ఆర్మూర్ యొక్క వర్గం
    రెండవ రౌండ్

    BRS  :  4810
    BJP :   8765
    CONGRESS :  7406
    1357  BJP  ఆదిక్యం

  • నిర్మల్ సెగ్మెంట్లో నాలుగో రౌండ్ ముగిసేసరికి 4,960 ఓట్ల ఆధిక్యంలో బిజెపి అభ్యర్థి పవర్ రామారావు పటేల్ ఉన్నారు

  • సిరిసిల్ల నియోజక వర్గం.. మూడవ రౌండ్ పూర్తి.. 2 వేల 621 ఓట్ల మెజార్టీతో కేటీఆర్ ముందంజ

  • కొడంగల్ నియోజకవర్గంలో7 రౌండ్లు కౌంటింగ్ పూర్తి :  8 వేల ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ముందంజ

  • కొల్లాపూర్ నియోజకవర్గంలో బర్రెలక్కకు మొదటి రౌండ్ పడిన ఓట్లు 473


    నిజామాబాద్ అర్బన్ :  

    3వ రౌండ్  ముగిసేసరికి  బీజేపీ అభ్యర్థి   సూర్య నారాయణ గుప్తా 2275 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు
    కాంగ్రెస్ కు:1732
    బిఆర్ఎస్ కు:1235
    బిజేపి:4007

  • వరంగల్ తూర్పు లో మూడో రౌండ్ లో కొండా సురేఖ 2771  మెజారిటీ

    మంథని నియోజవర్గం 4 వ రౌండ్ లో...

    1.  కాంగ్రెస్ (దుద్దిళ్ళ శ్రీధర్ బాబు) 6137

    2. బీఆర్ఎస్ (పుట్ట మధుకర్) 4472

    3. బిజెపి(చందుపట్ల సునీల్ రెడ్డి) 

    4. బీఎస్పీ( చల్ల నారాయణరెడ్డి)

    4 వ రౌండ్ ముగిసే సరికి  5090 ఓట్ల మెజార్టీతో ముందంజలో ... కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ బాబు

  • పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లీడ్ లో ఉండటంతో పోలింగ్ కేంద్రం నుంచి వెనుతిరిగి వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు డిసిసిబి డైరెక్టర్ , జెడ్పిటీసీ భర్త ఇంటూరి శేఖర్.

  • సాగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు

  • ములుగు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కంపు లో 
    మూడో  రౌండ్ లో 

    కాంగ్రెస్: 4227

    బిఆర్ఎస్: 2793

    మూడో రౌండ్ లో  1434ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి సీతక్క

  • వెనకంజలో ఉన్న మంత్రులు

    శ్రీనివాస్ గౌడ్ 
    ఎర్రబెల్లి 
    ఇంద్రకరణ్ రెడ్డి 
    కొప్పుల ఈశ్వర్ 

  • భారీ ఆధిక్యంలో వివేక్ బ్రదర్స్

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. రెండో రౌండ్ ముగిసే సమయానికి.. చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి 6 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండు రౌండ్లలో కాంగ్రెస్ పార్టీకి 12 వేల ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కు 5 వేల 800 ఓట్లు మాత్రమే పడ్డాయి. 

    ఇక బెల్లింపల్లి నియోజకవర్గంలో గడ్డం వినోద్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సమయానికి దుర్గం చిన్నయ్యపై 6 వేల 400 ఓట్ల ఆధిక్యంగా కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ ముందున్నారు. 

    వివేక్ బ్రదర్స్ ఇద్దరూ రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి.. భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • బెల్లంపల్లిలో  కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ 10 వేల ఆధిక్యంలో ఉన్నారు.  

  • హుజురాబాద్
    రౌండ్ 2

  • హుజూరాబాద్ లో రెండో రౌండ్ లోనూ ఆధిక్యంలో పాడి కౌశిక్ రెడ్డి..
    బీఆర్ఎస్ - 3911
    కాంగ్రెస్ - 3758
    బిజేపి - 2199

  • నాంపల్లిలో కాంగ్రెస్ ఆధిక్యం

    ఫస్ట్ రౌండ్
    BJP (672)   
    BRS (1081) 
    CONGRESS (3136)  
    AIMIM (2404) 
    BSP (732)

    కాంగ్రెస్ 732 ఓట్లతో మెజార్టీ


    మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం
     రెండో రౌండ్
    పద్మాదేవేందర్ రెడ్డి ( బీఆర్ఎస్ ) 3268
    మైనంపల్లి రోహిత్ ( కాంగ్రెస్ ) 3835
    పంజా విజయ్ కుమార్ ( బిజెపి ) 406
    రెండో రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు 567 ఓట్ల అధిక్యంలో ఉన్నారు

  • కామారెడ్డిలో మూడో రౌండ్ ముగిసిన తర్వాత కూడా కేసీఆర్ వెనకంజ
  • కంటోన్మెంట్ లో గద్దర్ కూతురు, కాంగ్రెస్ అభ్యర్థి వెనకంజలో ఉంది 
    బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత  ముందంజలో ఉంది 

  • సంగారెడ్డి జిల్లా 
    రౌండ్ -1
    అందోల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
     ముందంజలో కాంగ్రెస్ 
     మొత్తం. పోలైన ఓట్లు -12,783
    బీఆర్ఎస్ - 5,252
    కాంగ్రెస్  -6983
    బీజేపీ 183
    బీఎస్పీ - 25
    లీడ్ 1731
 
  • వనపర్తిలో బీఆర్ఎస్ ఆధిక్యం
  • చెన్నూరులో వివేక్ వెంకటస్వామి ఆధిక్యం
  •  ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య ఆధిక్యం
  • దుబ్బాకలో బీఆర్ఎస్ ఆధిక్యం
  • కామారెడ్డిలో రేవంత్ లీడ్ 
  • హుజురాబాద్ అసెంబ్లీ:
  • First round
  • బీఆర్ఎస్: 3907
  • బీజేపీ : 2548
  • కాంగ్రెస్: 2846
  • Lead: 1,061 brs lead
  • ఫస్ట్ రౌండ్ లో కేటీఆర్ ఆధిక్యం :
  •  బీఆర్ఎస్ కు 3 వేల 206 ఓట్లు పడగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 3 వేల 002 ఓట్లు.. బీజేపీకి 449 ఓట్లు పడ్డాయి

 

ఫస్ట్ రౌండ్ లో.. హైదరాబాద్ ఏరియా

  • ఖైరతాబాద్ లో 95 ఓట్ల తో బీఆర్ఎస్ లీడ్..
  • ముషీరాబాద్ లో బీఆర్ఎస్  లీడ్..
  • అంబర్ పెట్ లో బీఆర్ఎస్  లీడ్..
  • జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ లీడ్..
  • మలక్ పేట్ లో ఎంఐం  లీడ్..
  • చార్మినార్ లో బీజేపీ లీడ్..
  • సనత్ నగర్ లో బీఆర్ఎస్ లీడ్..
  • గోషామహల్ లో బీజేపీ లీడ్..
  • సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ లీడ్..
  • కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ లీడ్..
  • గజ్వేల్ మొదటి రౌండ్ లో  బీర్ఎస్ అభ్యర్థి  కేసీఆర్ 827  ఓట్ల మెజార్టీ

  • దుబ్బాక లోమొదటి రౌండ్ లో  బీర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 3,650 మెజార్టీతో ఉన్నారు

  • హుజురాబాద్ లో ఈటల రాజేందర్ వెనకంజలో ఉన్నారు. 

  • కామారెడ్డి మొదటి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డికి 2 వేల 766 ఓట్లు పడగా.. కేసీఆర్ కు 2 వేల 723 ఓట్లు పడగా.. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డికి 3 వేల 543 ఓట్లు పడ్డాయి. సీఎం కేసీఆర్ మూడో స్థానంలో ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది..

  • హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు.  

  • కొల్లాపూర్ లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది.  
    తాండూరులో బీఆర్ఎస్ లీడ్ లో ఉంది 
    సత్తుపల్లిలో బీఆర్ఎస్  లీడ్ లో ఉంది.  
    నాంపల్లిలో కాంగ్రెస్  లీడ్ లో ఉంది.  
    జగిత్యాలలో కాంగ్రెస్ లీడ్ లో ఉంది.  
    సికింద్రబాద్ లో బీఆర్ఎస్ లీడ్ లో ఉంది.  
    రాజేంద్రనగర్ లో బీఆర్ఎస్ లీడ్ లో ఉంది.  
    నాగార్జున సాగర్ లో కాంగ్రెస్  లీడ్ లో ఉంది.  

  • దుబ్బాకలో బీఆర్ఎస్ లీడ్ 
    సిద్దిపేటలో బీఆర్ఎస్ లీడ్  

  • చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి తొలి రౌండ్ లో 3 వేల ఓట్ల ఆధిక్యం

  • ప్రస్తుతం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్  ఆధిక్యంలో ఉంది.

  • పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ దూసుకుపోతుంది.  

    నల్గొండ నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తి.. 4000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
    కామారెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ముందంజ
    మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి ముందంజ
    అశ్వారావుపేట తొలిరౌండ్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం

  • హుజూర్‌నగర్‌లో 2 వేల ఓట్ల ఆధిక్యంలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

  • బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెనుకంజ
    పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి వెనుకంజ
    సనత్ నగర్ లో మంత్రి తలసాని ముందంజ 

  • మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి ముందంజ 

  • గజ్వేల్ కేసీఆర్ ముందంజలో ఉన్నారు.  
  • భువనగిరిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది  
  • అశ్వారావుపేట నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తి 

    కాంగ్రెస్ 4318
    బీఆర్ఎస్  2570

    మొదటి   రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి  జారేఆదినారాయణ 1748  ఓట్ల తేడాతో  ముందంజలో ఉన్నారు.  

    కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజ
  • పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో 
    కాంగ్రెస్‌  25 ముందంజ 
    బీఆర్ఎస్ 18 ముందంజ 
    బీజేపీ 1 
    ఎంఐఎం 1
 
  • కామారెడ్డిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో సీఎం కేసీఆర్ వెనుకంజ 
    సిరిసిల్లలో కేటీఆర్ ముందంజ 
  • మధిర నుంచి భట్టి విక్రమార్క అధిక్యం
  • కొడంగల్ లో రేవంత్ రెడ్డి(కాంగ్రెస్) ముందంజ
  • ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు(కాంగ్రెస్) ముందంజ
  • నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందంజ
  • కోమటి రెడ్డి బ్రదర్స్ ముందంజ
  • కరీంనగర్  :  పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. ఇక్కడి నుంచి మంత్రి గంగుల కమాలాకర్ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు.  

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం 
    మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు 
    తెలంగాణ  వ్యాప్తంగా 2.20 లక్షల  పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు 
    ఆ తరువాత ఈవీఎంలను ఓపెన్ చేసి  కౌంటింగ్ షురూ
    కౌంటింగ్  వద్ద భారీ భద్రత 
    అరగంట నుంచి గంటలోపు ముగియనున్న కౌంటింగ్‌

  • కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్న అన్ని పార్టీల అభ్యర్థులు
    కాసేపట్లో కౌంటింగ్  ప్రారంభం 
 
  • కాంగ్రెస్  అధికారంలోకి రావడం ఖాయమని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.  తనను సీఎం చేయాలని కొందరు అనుకోవడం మంచి పరిణామమే అని చెప్పారు. అయితే సీఎం అనేది సీఎల్పీ తీర్మానంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.  
     
  • కోదాడలో రెండో రౌండ్​ ముగిసేసరికి కాంగ్రెస్​ అభ్యర్థి పద్మావతి ఆధిక్యం