8 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

 8 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. మూడు రోజులుకే సమావేశాలు ముగిశాయి. తొలి రోజు ఆరు నిమిషాలకే సభ వాయిదా పడింది. ఇక నిన్న, ఇవాళ సర్కార్ సొంత అజెండాతోనే సభ నడిపించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సభ కనీసం 20 రోజులైనా నడపాలని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఇక ఈ సెషన్ లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేసింది.  

రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శాసన సభలో 8 బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఇందులో విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లు, మోటార్ వెహికల్‌ పన్నుల చట్ట సవరణ బిల్లు, అజమాబాద్‌ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సూపరెన్యుయేషన్ సవరణ బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టగా శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.