అవసరమైతే సభను 8వ తేదీ దాకా నడుపుదాం : మంత్రి శ్రీధర్ బాబు

అవసరమైతే సభను 8వ తేదీ దాకా నడుపుదాం :  మంత్రి శ్రీధర్ బాబు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు పారిపోయారు?: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలను అవసరమైతే 8వ తేదీ వరకు నిర్వహిస్తామని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అసెంబ్లీ లాబీలో శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘సభను 15 రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసిన్రు. కానీ.. ఒక్క రోజుకే సభ నుంచి ఎందుకు పారిపోయారు? బీఆర్ఎస్ కు బీజేపీ భయం పట్టుకున్నది. 

ఉపాధి హామీ పథకంపై చర్చలో భాగంగా బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందోనని భయపడ్డ సభ నుంచి వాకౌట్ చేసిన్రు’’అని శ్రీధర్ బాబు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే డిమాండ్ చేశారని, అందుకు తాము సిద్ధమైతే ఇప్పుడు వాళ్లే సభలో లేరని దుయ్యబట్టారు.