అమెజాన్​ టీవీ, స్మార్ట్​ఫోన్ ​సేల్స్​లో టాప్​3 లో తెలంగాణ

అమెజాన్​ టీవీ, స్మార్ట్​ఫోన్ ​సేల్స్​లో టాప్​3 లో తెలంగాణ

హైదరాబాద్​, వెలుగు: స్మార్ట్​ఫోన్​లు, టెలివిజన్​ సేల్స్​లో తెలంగాణ టాప్​3 మార్కెట్లలో నిలుస్తోందని అమెజాన్​ ఇండియా డైరెక్టర్ (స్మార్ట్​ఫోన్స్ అండ్​ టెలివిజన్స్​) రంజిత్​ బాబు వెల్లడించారు. ఈ పండుగ సీజన్​లో  టెలివిజన్​, స్మార్ట్​ఫోన్​ అమ్మకాలలో హైదరాబాద్​ ముందంజలో ఉందని చెప్పారు. శామ్​సంగ్​, వన్​ప్లస్​, రియల్​మి, నార్జో, షియోమి, ఐకూ స్మార్ట్​ఫోన్​  బ్రాండ్లను, సోనీ, శామ్​సంగ్​, ఎల్​జీ టెలివిజన్​ బ్రాండ్లను తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. 

గ్రేట్​ఇండియన్​ ఫెస్టివల్​ ఎక్స్​ట్రా హ్యాపీనెస్​  డేస్​ సందర్భంగా అమెజాన్​ ఎక్స్​పీరియన్స్​ ఎరినా పేరుతో ఒక ఈవెంట్​ను ఐఐటీ హైదరాబాద్​లో నిర్వహించారు. తెలంగాణలో టీవీలకు డిమాండ్​ రెండు రెట్లు పెరిగిందని, 5 జీ స్మార్ట్​ఫోన్లకు డిమాండ్​ 60 శాతం ఎక్కువైందని రంజిత్​ బాబు వివరించారు.

 అమెజాన్​ అందించే ప్రొడక్టులపై మీడియాతోపాటు, ఇన్​ఫ్లుయెన్సర్లు, కస్టమర్లకు అవగాహన పెంచేలా ఈ అమెజాన్​ ఎక్స్​పీరియన్స్​ ఎరినాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ మొదటి రెండు రోజుల్లోనే 9 కోట్ల మంది విజిటర్లు అమెజాన్​ సైట్​చెక్​ చేసినట్లు బాబు వెల్లడించారు. 

తాజా సీజన్​లో తమ సేల్స్​ జోరుగా సాగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. అమెజాన్​కు తెలంగాణ మార్కెట్​ కీలకమైనదని వివరించారు. ఆరు పెద్ద ఫుల్​ఫిల్​మెంట్​ సెంటర్లు, ఒక సార్టేషన్​ సెంటర్ ​తెలంగాణలో పనిచేస్తున్నాయని అన్నారు. డిజిట్​ సహకారంతో స్మార్ట్​ఫోన్​ జీనీ పేరుతో ఒక ఫీచర్​ తెచ్చామని చెబుతూ, దీంతో తమకు సరిపోయే స్మార్ట్​ఫోన్​ను ఎంపిక చేసుకోవడం కస్టమర్లకు సులభమవుతుందన్నారు.