ఎల్పీజీ గ్యాస్ కొరత తీర్చాలి..ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో డ్రైవర్ల నిరసన

ఎల్పీజీ గ్యాస్ కొరత తీర్చాలి..ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో డ్రైవర్ల నిరసన

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్పీజీ వాహనాల సంఖ్యకు అనుగుణంగా గ్యాస్ అవుట్​లెట్లను పెంచాలని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్​లో చేపట్టిన నిరసనలో బీఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్ మాట్లాడుతూ..  కేంద్రం గ్యాస్ కొరత లేదని చెబుతున్నా రాష్ట్రంలో ఎందుకు రద్దీ ఉంటుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వెంటనే రవాణా, సివిల్ సప్లై అధికారులు స్పందించి గ్యాస్ కొరత తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనలో రాష్ట్ర అధ్యక్షులు నందకిషోర్, ప్రధాన కార్యదర్శి పెంటయ్య గౌడ్​తో పాటు పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు.