హైదరాబాద్సిటీ, వెలుగు : కాంగ్రెస్అధికారంలోకి వచ్చే ముందు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రకటించిన అన్ని హామీలను అమలు చేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ డిమాండ్చేసింది. జేఏసీ లీడర్లు ఎ.సత్తిరెడ్డి, బి.వెంకటేశం, వి.మారయ్య, ప్రవీణ్, శ్రీకాంత్, ఎంఏ సలీం,యాదగిరితో కూడిన ప్రతినిధి బృందం సోమవారం హైదరాబాద్జేటీసీ వెంకటరమణను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని, జీవో 263 ప్రకారం మిగిలిన ఆటో పర్మిట్లను ఇవ్వాలని, అక్రమంగా నడుస్తున్న ఇతర జిల్లాల ఆటోలను నిషేధించాలని కోరారు.
