
బీసీ 42శాతం రిజర్వేషన్లకోసం బీసీ సంఘాల జేఏసీ తలపెట్టిన తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్ ప్రశాంతంగా సాగుతోంది.శనివారం ( అక్టోబర్18) హైదరాబాద్నగరంతోపాటు అన్ని జిల్లాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటించారు ప్రజలు. స్టేట్ వైడ్ గా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. హైదరాబాద్ సిటీలో కూడా వ్యాపారులు స్వచ్చందంగా షాపులు మూసివేసి బంద్ లో పాల్గొన్నారు. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బీసీ సంఘాల నాయకులు బంద్ లో పాల్గొన్నారు.
42 శాతం కోసం బీసీల సంఘాల బంద్ పిలుపు మేరకు జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బీసీ సంఘాల నేతలు బంద్ లో పాల్గొన్నారు.శేరిలింగంపల్లి లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్పాటించారు. బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యారు. ఎంజీబీఎస్, కంటోన్మెంట్, ఫికెట్ లలో బస్సులు డిపోలలోనే ఉండిపోయాయి. మరోవైపు దిల్ సుఖ్ నగర్ డిపోలో ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందగా బీసీ బంద్ పాటించారు. దీంతో పండక్కి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంద్ ప్రభావం తో ఉప్పల్ మెట్రో రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారుప్రయాణికులు.
మరోవైపు హైదరాబాద్ సిటీ మొత్తం బంద్ పాటించింది. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్ పాటించారు. ఉప్పల్ లో వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. అన్ని వర్గాల ప్రజలు బంద్ లో పాల్గొని సంఘీభావం తెలిపారు.