రేపటి  (అక్టోబర్ 5 )నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్లు బంద్ చేస్తాం :  తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ 

రేపటి  (అక్టోబర్ 5 )నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్లు బంద్ చేస్తాం :  తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ 
  • ఫీజుల పెంపుపై  బార్ యజమానుల ఆగ్రహం

సైఫాబాద్, వెలుగు :  రాష్ట్రంలో బార్ల నిర్వహణ, లైసెన్స్ నిబంధనలు, ఫీజుల పెంపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించని పక్షంలో సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్లను మూసివేస్తామని హెచ్చరించింది. సైఫాబాద్‌‌‌‌లోని అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడు దామోదర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎక్సైజ్ శాఖ ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుస్తున్న బార్ యజమానులను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.

ఒక్కో బార్‌‌‌‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం 60 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలతో వేలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో రూ.40 లక్షలుగా ఉన్న లైసెన్స్ ఫీజును రూ.44 లక్షలకు పెంచి బార్ యజమానులపై అదనపు భారం మోపుతున్నారని దామోదర్ గౌడ్ విమర్శించారు.  ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి రాజుగౌడ్, అరుణ్‌‌‌‌గౌడ్ పాల్గొన్నారు.