అంబర్పేట, వెలుగు: తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ గా కుందారం గణేశ్చారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం కాచిగూడలో జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృతంలో జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మధు యాష్కి గౌడ్, వి.హనుమంతరావు, సినీ దర్శకుడు శంకర్, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ప్రొఫెసర్ బాగయ్య హాజరయ్యారు.
జేఏసీ చైర్మన్ గా ఎన్నికైన కుందారం గణేశ్చారికి నియామకపత్రం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్యాం కుర్మా, తాటికొండ విక్రమ్ గౌడ్, కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, మణి మంజరి సాగర్, శ్రీధర్, పిట్ల నగేశ్, నరసింహ, వీరన్న, నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు.
