కేబీఆర్ పార్కుకు ఆచార్య జయశంకర్ పేరు..నామకరణం చేసిన బీసీ పొలిటికల్ జేఏసీ

కేబీఆర్ పార్కుకు ఆచార్య జయశంకర్ పేరు..నామకరణం చేసిన బీసీ పొలిటికల్ జేఏసీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: కేబీఆర్ పార్కు పేరును ప్రొ. జయశంకర్ నేషనల్ పార్కుగా తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ నామకరణం చేసింది. శనివారం ఆచార్య జయశంకర్14వ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్కు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య​అతిథిగా హాజరై మాట్లాడారు. పార్కుకు వెంటనే కాసు బ్రహ్మానందరెడ్డి పేరుకు బదులు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశాడు.