తెలంగాణ సెయిలర్లకు 9 మెడల్స్

తెలంగాణ సెయిలర్లకు 9 మెడల్స్

హైదరాబాద్, వెలుగు: నేషనల్ ర్యాంకింగ్ సెయిలింగ్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో  తెలంగాణ బెస్ట్ టీమ్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది.  మేఘాలయలోని  షిల్లాంగ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఈ టోర్నీలో రాష్ట్ర సెయిలర్లకు మొత్తం తొమ్మిది మెడల్స్ లభించాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన గోవర్ధన్ పల్లారా అండర్15 కేటగిరీలో తొలిసారి జాతీయ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఓవరాల్ గోల్డ్ కూడా నెగ్గాడు. కొమరవెల్లి దీక్షిత, లహరి గర్ల్స్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్, సిల్వర్ సాధించారు. అండర్‌‌‌‌‌‌‌‌ 18 సింగిల్‌‌‌‌‌‌‌‌ హ్యాండర్‌‌‌‌‌‌‌‌లో వైష్ణవి వీరవంశం గోల్డ్ నెగ్గగా, అండర్‌‌‌‌‌‌‌‌ 18 డబుల్‌‌‌‌‌‌‌‌ హ్యాండర్‌‌‌‌‌‌‌‌లో తనుజా కామేశ్వర్‌‌‌‌‌‌‌‌– గణేష్‌‌‌‌‌‌‌‌ సిల్వర్  ఖాతాలో వేసుకున్నారు. ధరణి లావేటి–మల్లేష్  కూడా సిల్వర్ మెడల్ గెలిచారు. రాష్ట్రానికి చెందిన సుహీమ్ షేక్‌‌‌‌‌‌‌‌  బెస్ట్‌‌‌‌‌‌‌‌  కోచ్‌‌‌‌‌‌‌‌ అవార్డు అందుకున్నాడు.