హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ప్రచార రథాలను సిద్ధం చేసుకుంటున్నది. ఇసుజు సుజికీ కంపెనీకి చెందిన 22 వెహికల్స్ ను ఇప్పటికే రాష్ట్రంలోని జిల్లాలకు పంపించారు. మరికొన్నింటిని కూడా పంపించే ఏర్పాట్లలో రాష్ట్ర నాయకత్వం ఉంది.
ఒక్కో వెహికల్ ఖరీదు రూ. 14 లక్షలు కాగా, ప్రచార రథంలా మార్చేందుకు మరో 4 లక్షలు ఖర్చువుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 18 లక్షలకు ఒక్కో ప్రచార రథం రెడీ అవుతోంది. సోమవారం ప్రచార రథం బీజేపీ స్టేట్ ఆఫీసుకు రావడంతో అందరి దృష్టి దానిపైనే పడింది.
