
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. సంజయ్ తోపాటు రాష్ట్ర బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు, డా. లక్ష్మణ్ లు కూడా ఢిల్లీ వెళ్లారు. వీరు బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కలవనున్నారు. ఇవ్వాళ సాయంత్రం జరగనున్న పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలు పాల్గొనున్నారు. రేపు ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరనుంది ఈ మీటీంగ్కు కూడా వారు హాజరవుతారు. ఆగస్ట్ 2 నుంచి మూడో విడత ప్రజా సంగ్రామయాత్రకు సిద్ధమవుతోన్నారు బండి సంజయ్. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు పార్టీ పెద్దలను కలవనున్నారు.