
- క్లస్టర్ గా ఎంపీ సెగ్మెంట్
- క్లస్టర్‌కు నలుగురు ఇంచార్జులు
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోంది. ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక క్లస్టర్ గా తీసుకొని, నలుగురిని ఇంచార్జులుగా నియమించాలని నిర్ణయించింది. ఈ ఇంచార్జుల ఆధ్వర్యంలో మున్సిపాలిటీల వారీగా సమస్యలను గుర్తించి, ప్రజల తరఫున పోరాడాలని భావిస్తోంది. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన నేతలు ఈ మేరకు ఆయా అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. పార్టీ స్టేట్ప్రెసిడెంట్ కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ నేతలు మురళీధర్ రావు, ఇంద్రసేనారెడ్డి, పలువురు రాష్ట్ర కమిటీ నేతలు పాల్గొన్నారు. వార్డు, డివిజన్ స్థాయిలో చేరికలను తీవ్రతరం చేయాలని సమావేశంలో వాళ్లు నిర్ణయించారు. అన్ని మున్సిపాలిటీలలో ప్రతి వార్డు, డివిజన్ నుంచి పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టాలని సమావేశం నిర్ణయించింది. మున్సిపోల్స్‌లో సత్తా చాటాలని, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికల గెలుపు స్ఫూర్తిగా నిలవాలని చర్చించారు.