కాంట్రాక్ట్‌‌ డ్రైవర్లు, కండక్టర్ల రెగ్యులరైజ్

కాంట్రాక్ట్‌‌ డ్రైవర్లు, కండక్టర్ల రెగ్యులరైజ్
  • 296 మంది డ్రైవర్లు, 63 మంది కండక్టర్లు పర్మినెంట్
  • ఉత్తర్వులిచ్చిన సునీల్‌‌ శర్మ

ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌‌ కండక్టర్లు, డ్రైవర్ల ఉద్యోగాలు రెగ్యులర్‌‌ అయ్యాయి. ఆర్టీసీ ఇన్‌‌చార్జి ఎండీ సునీల్‌‌ శర్మ ఉత్తర్వులిచ్చారు. 296 మంది కాంట్రాక్ట్‌‌ డ్రైవర్లు, 63 మంది కండక్టర్స్‌‌ను పర్మినెంట్‌‌ చేశారు. కొత్తగా రెగ్యులర్ అయినవాళ్లకు ఈ నెల నుంచి ప్రొబెషనరీ పీరియడ్ అమల్లోకి వస్తుంది. కనీసం 240 రోజులు పనిచేసిన కార్మికులను పర్మినెంట్‌‌ చేశారు. రివైజ్డ్‌‌ పేస్కేల్‌‌2013 ప్రకారం టైం స్కేల్‌‌ వర్తించనుంది. డ్రైవర్‌‌ గ్రేడ్‌‌–2కు రూ.13,780, కడక్టర్‌‌ గ్రేడ్‌‌–2కు రూ.12,610 ప్రారంభ వేతనం ఉండనుంది. ఏపీ ఏపీఎస్‌‌ ఆర్టీసీలో18 వేల మందిని రెగ్యులర్‌‌ చేయగా, తెలంగాణ వచ్చాక 4,001 మందిని రెగ్యులర్‌‌ చేశారు.