సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. శనివారం (మే23) జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూన1 నుంచి ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించాలని కేబినెట్ లో నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టునున్నారు. గోదావరి పుష్కరాలకు వెయ్యి కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు జూనియర్ కాలేజీల్లో మధ్యహ్నాం బోజన పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
జూన్ 1నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో కేబినెట్ అనంతరం నిర్ణయాలను ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలో జూన్ 1 రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిస్తామన్నారు. రెండో విడతలో రెండున్నర లక్షల ఇండ్లను నిర్మించి పేదలకు ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 2వేల ఇండ్లు ఇస్తామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లకు కూడా ఆర్థిక సాయం చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14వేల 800 పూరి గుడిసెలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు మంత్రి.
మరోవైపు అర్బన్ ఏరియాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి పేదలకు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి. అర్బన్ ఏరియాల్లో రూ.5లక్షలతో పాటు అన్ డివైడెట్ షేర్ ఇస్తామన్నారు. పట్టణాల్లోపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఇండ్లు కేటాయిస్తామన్నారు. పేదలు నివసించే ప్రాంతాల్లోనే వారికి ఇండ్లుకట్టిస్తామన్నారు. త్వరలో అర్బన్ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లకు గైడ్ లైన్స్ రూపొందిస్తామన్నారు గతంలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లకు, ఇందిరమ్మ ఇండ్లకు చాలా తేడా ఉందన్నారు మంత్రి.
