18న కేబినెట్‌ విస్తరణ!

18న కేబినెట్‌ విస్తరణ!

హైదరాబాద్‌‌, వెలుగు: మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 18న ఇందుకు ముహూర్తం కుదిరిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. శుక్రవారమే సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ నరసిం హన్‌ ను కలిసి మంత్రివర్గంపై చర్చిస్తారని, సోమవారం కచ్చితంగా విస్తరణ
ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆశావహులంతా ఇప్పటికే హైదరాబాద్‌లో మకాం వేశారు. 18వ తేదీ వరకు ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
క్లోజ్‌గా ఉండే సీనియర్ నేతలతో టచ్‌లో ఉంటున్నారు. ఒకవేళ శుక్రవారం విస్తరణ ఉంటే గురువారం సాయంత్రం వరకు సమాచారం వస్తుందని నేతలు ఎదురుచూశారు. కానీ ఆ దిశగా సంకేతాలేవీ కన్పించలేదు. శనివారం స్పీక ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి దశ దిన కర్మ ఉంది. కేటీఆర్‌తో పాటు పార్టీ ముఖ్య నేతలంతా ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు కుదరక పోవచ్చన్న చర్చ నడుస్తోంది. ఇక 17న ఆదివారం సీఎం కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి. ఆ రోజు కూడా కుదరదు కాబట్టి.. సోమవారం విస్తరణ ఉంటుందని ఆశావహులంతా
అంచనా వేస్తున్నారు. కొత్తగా ఆరుగురికి మాత్రమే అవకాశం దక్కుతుందన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో సాగుతోంది.