తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం కొనుగోలు భాద్యత కలెక్టర్లకు అప్పగించింది. అలాగే  తడిసిన ప్రతీ గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపింది. అంతేగాకుండా జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయించింది.  కేబినెట్ నిర్ణయాలను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

కేబినెట్  నిర్ణయాలు

  • రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం  కొనుగోలు జరిగేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి
  • రేపటి నుంచి కలెక్టర్లు,డిప్యూటీ కలెక్టర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలి
  • రైతులు అధైర్యపడొద్దు.. ఎవరి మాయమాటలు నమ్మొద్దు
  •  తెలంగాణలో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోంది
  • తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది 
  • మూడు రోజుల్లోనే రైతుల ఖతాల్లో డబ్బులు వేస్తాం 
  •  రైతులు ఇబ్బంది పడొద్దనేది ప్రభుత్వ నిర్ణయం
  •  ఇప్పటి వరు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
  • వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తాం
  •  నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
  • రైతుల లూజు విత్తనాలు కొనొద్దు
  • కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై చర్చ
  • కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారం  చర్యలు తీసుకుంటాం
  • మూడు డ్యామ్ లు ప్రమాదంలో ఉన్నాయని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది
  • రిపేర్లు చేసినా డ్యామ్ లు నిలబడతాయన్న నమ్మకం లేదని ఎన్డీఎస్ఏ చెప్పింది
  • అన్నారం, సుందిళ్ళ, మెడిగడ్డ లో చుక్క నీరు కూడా నిలువ ఉండొద్దు అని రిపోర్ట్ ఇచ్చింది...
  • స్కూళ్లలో మెరుగైన వసతుల కోసం శ్రీధర్ బాబు నేతృత్వంలో కమిటీ
  • ప్రభుత్వ పాఠశాలలకు రూ.600 కోట్లు కేటాయింపు
  • ప్రైవేటు పాఠశాలలకు ధీటు ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతాం
  •  కేసీఆర్ సర్కార్ దశాబ్ధ కాలంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారు
  • విద్యావ్యవస్థకు పెద్దపీఠ వేస్తున్నాం
  • దశాబ్ధ కాలంలో విద్యార్థులు ఏం నష్టపోయారో ఆ నష్టాన్ని భర్తీ చేస్తాం
  • 2004 లో దేశంలోనే ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్..
  • రైతుల పై ఎవరికి ఎలాంటి ప్రేమ ఉందొ అందరికి తెలుసు...
  • నిన్న మొన్న కొంత మంది ధర్నాలు పేరుతో డ్రామాలు చేసిండ్రు...
  • ఆగస్టు 15 లోవు ఋణమాపి చేస్తాం...
  • 5600 ప్రభుత్వ పాఠశాలలు మూత పడ్డాయి...
  • జూన్ 2 వేడుకలకు అందరిని ఆహ్వానిస్తం.... మాకు భేషజాలు లేవు..