
హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ కాసేపట్లో భేటీ కానుంది. మధ్యాహ్నం 2గంటలకు సీఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లు, రైతు బంధు నిధుల విడుదల, దళిత బంధు తదితర అంశాలపై మీటింగ్ లో చర్చిస్తారు. సొంతింటి స్థలం ఉన్న నిరుపేదలకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం ఇవ్వడంపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది.
అసెంబ్లీ సమావేశాల తేదీలను కేబినెట్ మీటింగ్ లో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. సమావేశాల్లో ఏ అంశాలపై చర్చించాలన్న విషయం కూడా మీటింగ్ లో ప్రస్తావనకు వచ్చే ఛాన్సుంది. మరోవైపు గత అసెంబ్లీ సమావేశాల్లో సభ ఆమోదించిన 6 బిల్లులకు గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదం తెలుపలేదు. ఈ 6 బిల్లులపై ఎలా ముందుకెళ్లాలన్న ఇష్యూ ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.