గోదావరి పరివాహక ప్రాంతంపై విదేశాల కుట్ర..!

గోదావరి పరివాహక ప్రాంతంపై విదేశాల కుట్ర..!

భద్రాచలం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ వర్షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ సృష్టిస్తున్నట్లు తమకు తెలిసిందని.. ఇతర దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారని అన్నారు. గతంలో లద్దాఖ్, లేహ్, ఉత్తరాఖండ్ లో ఇలాగే జరిగిందని చెప్పారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంపై కూడా కుట్ర చేసినట్లు కేసీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. 

భారీ వర్షాల వల్ల తలెత్తే ఉత్పాతానికి ఈ వరదలు నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు. వరదల కారణంగా రాముల వారి ఆలయం ముంపునకు గురి కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని ముంపు నుంచి రక్షించి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే మరోసారి భద్రాచలానికి వస్తానని చెప్పారు. సీతమ్మ పర్ణశాలను కూడా వరద నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.