కేంద్ర హోం మినిస్టర్‌ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం

కేంద్ర హోం మినిస్టర్‌ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం

కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి దిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. అలాగే విభజన హామీలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా సీఎం భేటీ అయ్యారు. సీఎం వెంట ప్రధాని మోదీ వద్దకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా వెళ్లారు.