
రాష్ట్ర ఏర్పాటులో భాగంగా విభజన చట్టాలలోని అంశాల గురించి హోంమంత్రి, ప్రధాన మంత్రితో చర్చించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ లో తెలిపారు. రెండవ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి లు ప్రధాన మంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రిని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన పెడింగ్ బిల్లులను, సంక్షేమ కార్యక్రమాలను గురించి రాత పూర్వకంగా వినతి పత్రం ఇచ్చారు.
ఆక్షన్ లేకుండా సిగ్గరేణి బొగ్గుగనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని, డిఫెన్స్ భూములను అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వాలని కోరినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క తెలిపారు.
ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధిపైనే పూర్తిగా దృష్టి పెట్టామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి రైల్వే కోచ్ ప్రాజెక్ట్, ప్రతి జిల్లాకు ఓ నవోదయ, కస్తూర్భా స్కూల్స్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కు తిరిగి అనుమతి మంజూరు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. తెలంగాణాలో డ్రగ్స్ నిర్మూలన, సైబర్ సెక్యూరిటీకి సహకరించాలని కేంద్రాన్ని కోరారు.
రాష్ట్రానికి రావాల్సిన 29 మంది ఐపీఎస్ ఇద్యోగులను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి మోదీని కోరినట్లు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం గురించి చర్చించారు. తెలంగాణకు 25లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిపారు.