ప్రజల ఆత్మగౌరవం ఇనుమడించేలా సచివాలయం నిర్మించాం: కేసీఆర్

ప్రజల ఆత్మగౌరవం ఇనుమడించేలా సచివాలయం నిర్మించాం: కేసీఆర్

తెలంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ఏప్రిల్ 30 న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ విషెస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట మహోన్నతంగా వెలుగులీనేలా, ప్రజల ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా సచివాలయం నిర్మించామన్నారు.  ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, వినూత్న రీతిలో అత్యద్భుతంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించుకున్నామని తెలిపారు.

https://twitter.com/TelanganaCMO/status/1652314322532700161

తెలంగాణ సచివాలయాన్ని మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. సచివాలయ నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు ఉంటుంది. 265 అడుగుల ఎత్తున భవనాన్ని నిర్మించారు. కొత్త సచివాలయంలో 11 అంతస్తుల ఎత్తుతో ప్రధాన నిర్మాణం కనిపిస్తోంది. ఇక ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరాలను ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న 16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు, విభాగాల కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు, విభాగాల కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్‌ సదుపాయం  కల్పించారు.