ఊరిని బాగు చేసుకుంటామని  తీర్మానం పంపండి

ఊరిని బాగు చేసుకుంటామని  తీర్మానం పంపండి
  •     మోడల్ ​విలేజ్​గా తీర్చిదిద్దుతాం 
  •     ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకుని 
  •     పది మందికి ఉపాధి కల్పించండి
  •     వాసాలమర్రిలో సీఎంఓ సెక్రెటరీ స్మితా సబర్వాల్

యాదాద్రి, వెలుగు : ‘మీరందరూ కలిసి ఉండి గ్రామాన్ని బాగు చేసుకుంటామని తీర్మానం చేసి పంపించండి. వాసాలమర్రిని మోడల్​విలేజ్​గా మారుస్తాం’ అని సీఎంఓ సెక్రెటరీ స్మితా సబర్వాల్​అన్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని సీఎం కేసీఆర్​దత్తత గ్రామమైన వాసాలమర్రిని ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఎస్సీ డెవలప్​మెంట్ ​సెక్రెటరీ రాహుల్ బొజ్జా, పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్, విమెన్ ​అండ్ ​చైల్డ్ ​వెల్ఫేర్ ​డిపార్ట్​మెంట్​ సెక్రెటరీ గీతతో కలిసి విజిట్​చేశారు. దళితబంధు లబ్ధిదారుల దగ్గరకు వెళ్లి యూనిట్లను పరిశీలించారు. రైతువేదికలో గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి రైతుబంధు స్కీం అమలుతో పాటు ఊరి సమస్యలడిగి తెలుసుకున్నారు.

‘వాసాలమర్రికి సంబంధించిన అన్ని డిటెయిల్స్​ మా దగ్గర ఉన్నాయి. మీరంతా కలిసి ఉండాలి. ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకోవాలి. పది మందికి ఉపాధి కల్పించాలి. దీనికి సంబంధించి పంచాయతీ తీర్మానం చేసి పంపించండి. మీ ఊరిని మోడల్​ విలేజ్​గా తీర్చిదిద్దుతాం’ అని అన్నారు. ప్రభుత్వ విప్ ​గొంగిడి సునీత, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్, డీఆర్​డీఓ ఉపేందర్ రెడ్డి, డీపీఓ సునంద, జడ్పీ వైస్ చైర్మన్ భీకూ నాయక్, ఆర్డీఓ భూపాల్ రెడ్డి, ఎంపీపీ భూక్యా సుశీల, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.