
నాటు నాటు’ సాంగ్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఆ ఒక్క పాటతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తన వైవిధ్యమైన గొంతుతో తెలుగులో పాటలు పాడుతూ ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు.
ఇపుడీ ఈ తెలంగాణ గొంతుకకి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ కోటి నజరానా ప్రకటించింది. నేడు (జులై 20న) పాతబస్తీ బోనాల సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్‌కు రూ.కోటి ప్రోత్సాహకం అందజేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాహుల్ స్వయంకృషితో.. ఓపక్క సింగర్ గా కంటిన్యూ అవుతూనే.. మరోపక్క ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇలా హైదరాబాద్ నుంచి ఆస్కార్ స్థాయికి ఎదిగిన సింగర్ రాహుల్ యువతకు ఆదర్శమని ప్రశంసించారు.
బోనాల సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల నజరానా
— Congress for Telangana (@Congress4TS) July 20, 2025
– ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
Rahul Sipligunj Receives ₹1 Crore Bonalu Honor – CM Revanth Keeps His Promise
హైదరాబాద్ బోనాల సందర్భంగా గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను… pic.twitter.com/xBMvOe4FZs
2023లోనే ఓ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆస్కార్ గెలుచుకున్న రాహుల్ సిప్లిగంజ్‌కు రూ.10 లక్షలు నగదు ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కోటి రూపాయల నగదు ఇస్తామని చెప్పారు. ఆర్టిస్టులను సన్మానించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాడు రేవంత్ చెప్పినట్టుగానే తాజాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయలను బహుమతిగా ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇటీవలే గద్దర్ అవార్డుల వేడుకలోనే రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అవార్డు ఇవ్వకపోయినా ఏదో ఒకటి ఇవ్వాలని సీఎం చెప్పగా.. దానికి డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క తల ఊపుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేడు బోనాల సందర్భంగా రాహుల్కు కోటి రూపాయల నజరానా ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.