హుజూరాబాద్‌లో గ్రామానికో ఇన్‌ఛార్జ్

హుజూరాబాద్‌లో గ్రామానికో  ఇన్‌ఛార్జ్

హుజూరాబాద్ లో మండలానికి ఒక చీఫ్ కో-ఆర్డినేటర్ ను, గ్రామానికి ఒక ఇంఛార్జ్ ను వేయాలని నిర్ణయించామన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్. ఏడేళ్లుగా టీఆర్ఎస్ హయాంలో.. అవినీతి రాజ్యమేలుతుందన్నారు. ఒక పార్టీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే.. మరో పార్టీ దేశంలో సామన్యుల బతుకును చిదిమేస్తుందని విమర్శించారు. గతంలో మైనారిటీ, గిరిజన రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేశారని సైలెంట్ గా ఉన్నారని.. ఇప్పుడు బీసీ జనగణనపై తీర్మానం కూడా అలాంటిదేనని చెప్పారు మహేశ్ గౌడ్. ఓబీసీ జనగణనపై సోమవారం ఇందిరాభవన్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. కేంద్రానికి రిప్రజంటేషన్ పంపిస్తామన్నారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల మీటింగ్ జరిగింది. హుజూరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  చర్చించారు.

మరిన్ని వార్తల కోసం

విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావ్.. ఎక్కడ చదువుకున్నావ్?

లఖీంపూర్ అప్డేట్: విచారణకు హాజరైన మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా

క్వార్టర్ సీసాతో బతుకుతమా?..కాళేశ్వరంతో బతుకుతమా?