రాజీవ్ గాంధీ ఒక వ్యక్తి కాదు వ్యవస్థ

రాజీవ్ గాంధీ ఒక వ్యక్తి కాదు వ్యవస్థ

రాజీవ్ గాంధీ ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అని  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మణిక్కమ్ ఠాగూర్ అన్నారు. 30వ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవం సందర్భంగా చార్మినార్ దగ్గర సమావేశం నిర్వహించారు. రాజీవ్ గాంధీ సద్భావన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు.  హైదరాబాద్ లో వరదలకు వేలాది మంది  చిక్కుకొని బాధలు పడుతున్నారన్నారు. వరద బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ.. గాంధీ సిద్ధాంతాలను నమ్ముకుంటుందన్నారు. సద్భావన గాంధీ సిద్ధాంతం అని.. ఇతర మతాలను, ఇతర కులాలను గౌరవించడం మన సంప్రదాయమన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశ మూల సిద్ధాంతమన్నారు.

రాజీవ్ గాంధీ లాంటి గొప్ప వ్యక్తులతో పని చేసిన నాయకులతో  పని చేయడం తనకు  గర్వంగా ఉందన్నారు. ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు రాబోయే జనరేషన్ గురించి ఆలోచించేవారు..కానీ ఇప్పుడున్న ప్రధాన మంత్రులు రాబోయే ఎన్నికల గురించి.. ఈవీఎంల గురించి ఆలోచిస్తున్నారన్నారు.భారత్ రత్న అనే బిరుదు రాజీవ్ గాంధీకి  సరిపోదన్నారు. రాహుల్ గాంధీ కూడా రాబోయే 30 ఏళ్ల భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నారన్నారు.

అలాంటి రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పాలి

జగిత్యాలలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్