కాంగ్రెస్ మేనిఫెస్ట్ : ఆరు గ్యారెంటీలే కాదు.. ఇంకా బోలెడు ఫ్రీలు

కాంగ్రెస్ మేనిఫెస్ట్ : ఆరు గ్యారెంటీలే కాదు.. ఇంకా బోలెడు ఫ్రీలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది.  ఇప్పటికే ప్రచారలతో హోరెత్తిస్తున్న  ఆ పార్టీ ఇప్పుడు మేనిఫెస్టోపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.  ఇప్పటికే ఆరు గ్యారెంటీల ప్రకటనలతో ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ ..  మేనిఫెస్టోలో కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.  

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న హస్తం పార్టీ..  అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపకల్పన చేసింది.  రాష్ట్ర పర్యటనలో భాగంగా నవంబర్ 17 శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు  ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో  మేనిఫెస్ట్ ను రిలీజ్ చేయనుంది.  

అమ్మహస్తం పేరుతో 9 నిత్యావసర వస్తువుల పంపిణీ,  గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం, రేషన్ డీలర్లకు గౌరవ వేతనంతో పాటు కమీషన్ వంటివి  మేనిఫెస్టోలో  పొందుపరచినట్టు సమాచారం.  

కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టనున్న కొన్ని అంశాలు

  • ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు
  • గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం..
  • రేషన్ డీలర్లకు గౌరవ వేతనంతో పాటు కమీషన్..
  • అభయ హస్తం పథకం పునరుద్ధరణ..
  • ఆర్ఎంపీ,‌పీఏంపీలకు గుర్తింపు కార్డులు..
  • అమ్మహస్తం పేరుతో 9 నిత్యావసర వస్తువుల పంపిణీ..
  • ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్..
  • ధరణి స్థానంలో భూ భారతి పేరుతో అప్ గ్రేడ్ యాప్..
  • జర్నలిస్ట్‌లకు మెట్రో ఫ్రీ..
  • మీడియా కమిషన్ ఏర్పాటు.. 
  • కల్యాణ లక్ష్మి కింద లక్ష సాయం, తులం బంగారం..
  • రేషన్ ద్వారా సన్న బియ్యం..
  • విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్
  • ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు
  • ఉద్యోగ కల్పన 
  • ఆటో వాలాలకు ఆర్థిక సహాయం..