పాస్ ల కోసం ఈ-మెయిల్‌, వాట్సప్ మెసేజ్

పాస్ ల కోసం ఈ-మెయిల్‌, వాట్సప్ మెసేజ్

లాక్ డౌన్ స‌మ‌యంలో 10వేల మంది నగర పోలీసులు 24 గంటల పాటు పనిచేస్తున్నారని తెలిపారు సీపీ అంజ‌న్ కుమార్. ప్రస్తుత పరిస్థితులపై 4 గంటల పాటు సమీక్షించామ‌న్న ఆయ‌న‌.. సమీక్ష తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నామ‌న్నారు. అత్యవసర విభాగాల్లో పనిచేసే వారికి పాస్‌లు ఇవ్వాలని నిర్ణయించామ‌ని.. హైదరాబాద్‌కు సంబంధించి 900 పాస్‌లు ఇచ్చామ‌న్నారు. వ్యక్తిగతంగా కూడా పాస్‌లు మంజూరు చేశామ‌న్న సీపీ. ఇంకా 700 పాస్ లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. పాల వాహనం అని రాసిన ట్యాంకర్లకు పాస్ లు అవసరం లేదన్నారు.

పాస్ ల కోసం ఆన్ లైన్ లో ఈ-మెయిల్‌ covid19.hyd@gmail.com రిక్వెస్ట్ పెట్ట‌వ‌చ్చన్నారు. అలాగే 9490616780 నెంబర్ కు వాట్సప్ మెసేజ్ పంపించవ‌చ్చ‌న్నారు. ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది ఐడీ కార్డును చూపించి పాస్ లు పొందవచ్చని… ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లేవారికి ఆస్పత్రి వాళ్లే ఆనుమతి పత్రం ఇస్తారన్నారు. పాస్ లను దుర్వినియోగం చేసినట్లు మా దృష్టికి వస్తే క్యాన్సిల్ చేస్తామని తెలిపారు సీపీ.