రేపట్నుంచి ( ఆగస్టు 3) రైతు రుణమాఫీ

రేపట్నుంచి ( ఆగస్టు 3) రైతు రుణమాఫీ

రాష్ట్రంలోని రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక  నిర్ణయం తీసుకున్నారు.  2023 ఆగస్టు 03 నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని  పునః ప్రారంభించాలని  అధికారులను  సీఎం ఆదేశించారు.  

నోట్లరద్దు వలన ఏర్పడిన మందగమనం, కరోనాతో ఏర్పడిన ఆర్థిక  సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధుల విడుదలలో కేంద్రం ఆలస్యం, కోత విధించడంతో ఏర్పడిన లోటు నుంచి రాష్ట్ర పరిస్థితి చక్కదిద్దుకున్న క్రమంలో రుణమాఫీ పునః ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు.   రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.  

రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ 45రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు. రైతులు ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరేవరకు విశ్రమించే ప్రసక్తి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.