- వీసీల ఆవేదనే సర్కార్ ఫెయిల్యూర్‌కు సాక్ష్యం: కాసం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యా వ్యవ స్థ అంపశయ్యపై కొట్టుమిట్టాడుతున్నదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేస్తే.. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రో జుల కింద జరిగిన సమావేశంలో వీసీల ఆవేదనే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వర్సిటీల్లో ఫ్యాకల్టీ కొరత ఉన్నది. మొత్తం 2,816 పోస్టులకు గానూ 2,059 ఖాళీలున్నాయి. కేవలం 755 మందే పనిచేస్తున్నారు. అంటే, దాదాపు 75 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి”అని వెంకటేశ్వర్లు అన్నారు. కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు, తెలుగు వర్సిటీ, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సి టీ.. ఇలా 6 యూనివర్సిటీల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేరని వెంకటేశ్వర్లు తెలిపారు.
