- విరిగిన బాధితుడి కాలు
మాదాపూర్, వెలుగు: ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడిపి ఢీకొట్టడంతో హోంగార్డు కాలు విరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నయీం హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం మాదాపూర్ 100 ఫీట్సిగ్నల్( అండర్‌పాస్) వద్ద డ్యూటీ చేస్తున్నాడు. ఆ సమయంలో బిర్యానీ టైమ్స్వైపు నుంచి ఓ వ్యక్తి కారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ వచ్చి రైట్ యూటర్న్తీసుకొని నయీంను ఢీకొట్టి పారిపోయాడు.
ఈ ప్రమాదంలో ఆయన కాలు విరిగింది. స్థానికులు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. విషయం తెలుసుకున్న మాదాపూర్ ట్రాఫిక్డీసీపీ సాయి మనోహర్, అడిషనల్డీసీపీ హనుమంత్‌రావు హాస్పిటల్‌కు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
