ఓవరాల్ చాంపియన్ తెలంగాణ

ఓవరాల్ చాంపియన్ తెలంగాణ

హైదరాబాద్‌‌, వెలుగు:  నేషనల్ బ్యాండీ ఫెడరేషన్ కప్ లో తెలంగాణ జట్టు ఓవరాల్ చాంపియన్‌‌గా నిలిచింది. ఏపీ బ్యాండీ అసోసియేషన్, బ్యాండీ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగిన ఈ ఈవెంట్‌‌లో తెలంగాణ జట్టు 4 గోల్డ్, 2 సిల్వర్ మెడల్స్‌‌తో 26 పాయింట్లు సాధించి మొదటి స్థానం సొంతం చేసుకుంది. ఐస్ హాకీని పోలిన ఈ ఆటలో  తెలంగాణ టీమ్స్  అండర్–-10 బాయ్స్, గర్ల్స్‌‌, అండర్--–14, 19  గర్ల్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ గెలిచింది.

 అండర్–--12 గర్ల్స్,  అండర్–--19 బాయ్స్ విభాగాల్లో సిల్వర్ మెడల్స్ సాధించింది. అత్యధిక గోల్స్ చేసిన  జోషిత్ శ్రీ సాయి ( అండర్--10 బాయ్స్, 7 గోల్స్), జాషి ప్రియ గంజి ( అండర్--14 గర్ల్స్, 5 గోల్స్) నగదు బహుమతులు అందుకున్నారు. బ్యాండీ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్స్ జనరల్ సెక్రటరీ లవ్ కుమార్ జాదవ్  విజేతలకు మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా బ్యాండీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పతకాలు నెగ్గిన ప్లేయర్లు, కోచ్‌‌ ఎండీ నసీరుద్దీన్‌‌ను  అభినందించారు.