సీఎస్ రామకృష్ణారావు టర్మ్ మరో 3 నెలలు పొడిగింపు!

సీఎస్ రామకృష్ణారావు టర్మ్ మరో 3 నెలలు పొడిగింపు!
  • కేంద్రానికి ఫైల్ పంపిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: సీఎస్​రామకృష్ణారావు పదవీకాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు మరో మూడు నెలల పొడిగింపు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఒక ఫైల్‌‌‌‌ను పంపింది. సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలఖారుతో ముగుస్తుంది. పాలనను గాడిలో పెట్టడం, ఇతర ఐఏఎస్ అధికారులతో సమన్వయం చేసుకోవడంలో ఆయన చూపుతున్న కృషిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో రామకృష్ణారావు మరో మూడు నెలల పాటు సీఎస్‌‌‌‌గా కొనసాగనున్నారు