ఢిల్లీకి చేరుకున్న మయన్మార్ సైబర్ బాధితులు.. అక్కడి నుంచి హైదరాబాద్కు తెలంగాణ వాసులు

ఢిల్లీకి చేరుకున్న మయన్మార్ సైబర్  బాధితులు.. అక్కడి నుంచి హైదరాబాద్కు తెలంగాణ వాసులు

న్యూఢిల్లీ, వెలుగు: మయన్మార్ లో సైబర్ ఫ్రాడ్ లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన బాధితులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. గురువారం అర్ధరాత్రి  ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని  కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకువచ్చింది. 

గ్రేటర్ నోయిడాలో వారిని కేంద్ర విదేశాంగ అధికారులు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు అప్పగించారు. ఇందులో తెలంగాణకు చెందిన 11 మంది ఉన్నారని ఢిల్లీలోని తెలంగాణ భవన్  అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఇతర జిల్లాలకు చెందిన వారు ఇందులో ఉన్నారని తెలిపారు.