
ఐటీ గ్రిడ్స్ కంపెనీ CEO అశోక్ ఎక్కడున్నా…అది అమరావతిలో ఉన్నా…అమెరికాలో ఉన్నా పట్టుకుని విచారిస్తామన్నారు సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర. దోషి అయితే కోర్టు, ప్రజల ముందు నిలబెడతామన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనన్నారు.
ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటాలో తెలంగాణ ప్రజల డేటా ఉందని తేలిందన్నారు స్టీఫెన్ రవీంద్ర. తెలంగాణ ప్రజల డేటాతో ఏం చేశారో..దేనికి వాడుతున్నారో విచారిస్తామన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో దర్యాప్తు జరుగుతుందన్నారు. సిట్‌లో తొమ్మిది మంది అధికారులు ఉంటారని…ఇందులో ఇద్దరు SPలు, ముగ్గురు డీఎస్పీలు, హైదరాబాద్ CCSలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఈ బృందంలో ఉన్నారని తెలిపారు.
ఈసీకి కంప్లైంట్ వెళ్లిన తర్వాత సేవామిత్రలో కొన్ని ఫీచర్స్ డిలీట్ అయ్యాయని.. అలా ఎందుకు చేశారో తెలుసుకుంటామన్నారు స్టీఫెన్ రవీంద్ర. సైబర్ నిపుణుల సహకారంతో సున్నితమైన కేసును లోతుగా విచారించాలని తెలిపారు. కేసు దర్యాప్తు నిస్పక్షపాతంగా చేస్తామన్నారు స్టీఫెన్ రవీంద్ర.